ఫార్చూన్ సీఈవోల్లో సత్య నాదెళ్ల | Microsoft: Satya Nadella steers Windows giant to recovery | Sakshi
Sakshi News home page

ఫార్చూన్ సీఈవోల్లో సత్య నాదెళ్ల

Nov 14 2014 5:29 AM | Updated on Sep 2 2017 4:24 PM

ఫార్చూన్ సీఈవోల్లో  సత్య నాదెళ్ల

ఫార్చూన్ సీఈవోల్లో సత్య నాదెళ్ల

అత్యుత్తమ సీఈవోల జాబితాలో ప్రవాస భారతీయులు ముగ్గురు చోటు దక్కించుకున్నారు.

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సీఈవోల జాబితాలో ప్రవాస భారతీయులు ముగ్గురు చోటు దక్కిం చుకున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, మాస్టర్‌కార్డ్ సీఈవో అజయ్ బంగా, హర్మన్ ఇంటర్నేషనల్ చైర్మన్ దినేష్ పాలివాల్ ఈ జాబితాలో ఉన్నారు. 50 మంది కార్పొరేట్ దిగ్గజాలతో ఫార్చూన్ మ్యాగజైన్ ‘బిజినెస్‌పర్సన్ ఆఫ్ ది ఇయర్’ పేరిట రూపొందించిన లిస్టులో గూగుల్ సీఈవో ల్యారీ పేజ్ అగ్రస్థానంలో, యాపిల్ సీఈవో టిమ్ కుక్ రెండో స్థానంలో నిల్చారు.

బంగా 28వ స్థానంలో, నాదెళ్ల 38వ స్థానంలో, పాలివాల్ 42వ స్థానంలో ఉన్నారు. ఇటు మార్కెట్లపరంగాను అటు రాజకీయాలపరంగాను అనేక ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ జాబితాలోని సీఈవోలు తమ కంపెనీలు ముందుకు దూసుకెళ్లేలా కృషి చేశారని ఫార్చూన్ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement