కొత్త ‘ఆల్టో 800’  

 Maruti Suzuki Alto 800 facelift launched at Rs 2.94 lakh - Sakshi

ప్రారంభ ధర రూ.2.93 లక్షలు

న్యూఢిల్లీ: దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ).. తాజాగా ‘ఆల్టో 800’ నూతన వెర్షన్‌ను మంగళవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ఎంట్రీ లెవెల్‌ నూతన వెర్షన్‌ హ్యాచ్‌బ్యాక్‌ కారు ధరల శ్రేణి రూ.2.93 లక్షల నుంచి రూ.3.71 లక్షలుగా ఉన్నాయి. గడిచిన 15 ఏళ్లుగా బెస్ట్‌ సెల్లింగ్‌ మోడల్‌ రికార్డును కొనసాగిస్తున్న ఆల్టో ఇప్పుడు బీఎస్‌–సిక్స్‌ ఉద్గార నిబంధనలకు అనుగుణంగా.. అధిక భద్రతా ప్రమాణాలు, నూతన డిజైన్‌తో విడుదలైందని కంపెనీ ప్రకటించింది.

పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన ఈకారులో ఏబీఎస్‌ (యాంటీ–లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌), ఈబీడీ (ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌), రివర్స్‌ పార్కింగ్‌ సెన్సార్, డ్రైవర్‌తో పాటు అతని పక్కన కూర్చున్న వ్యక్తికి సీట్‌ బెల్ట్‌ రిమైండర్‌ వంటి అధునాతన భద్రతా ఫీచర్లను జోడించిన కారణంగా ప్రస్తుత మోడల్‌ కంటే రూ.30,000 అధిక ధరతో ఉందని కంపెనీ ప్రకటన తెలిపింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top