మహీంద్రా లైఫ్ స్పేస్ లాభం 59% అప్ | Mahindra Lifespace Q4 profit up 59% | Sakshi
Sakshi News home page

మహీంద్రా లైఫ్ స్పేస్ లాభం 59% అప్

Apr 27 2016 1:19 AM | Updated on Sep 3 2017 10:49 PM

మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 59 శాతం పెరిగింది.

న్యూఢిల్లీ: మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 59 శాతం పెరిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ. 31 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.49 కోట్లకు పెరిగిందని మహీంద్రా లైఫ్ స్పేస్ తెలిపింది. ఆదాయం రూ.259 కోట్ల నుంచి రూ.266 కోట్లకు ఎగసిందని కంపెనీ ఎండీ, సీఈఓ అనిత అర్జున్‌దాస్ పేర్కొన్నారు. 60 శాతం డివిడెండ్‌ను(రూ.10 డివిడెండ్ గల ఒక్కో షేర్‌కు రూ.6) ఇవ్వనున్నామని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో  ఈ కంపెనీ షేర్ 3.47 శాతం వృద్ధితో రూ.460కు పెరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement