జియో ఫైనాన్షియల్‌ లాభం డౌన్‌ | Jio Financial Services reported a 13. 88percent declines | Sakshi
Sakshi News home page

జియో ఫైనాన్షియల్‌ లాభం డౌన్‌

Apr 18 2026 6:16 AM | Updated on Apr 18 2026 6:56 AM

Jio Financial Services reported a 13. 88percent declines

క్యూ4లో రూ. 272 కోట్లు 

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ కంపెనీ జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ గతేడాది(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి (క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 14 శాతం క్షీణించి రూ. 272 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2024–25) క్యూ4లో రూ. 316 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం దాదాపు రెట్టింపై రూ. 1,020 కోట్లకు చేరింది. 

అంతక్రితం ఇదే కాలంలో కేవలం రూ. 518 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. మొత్తం వ్యయాలు సైతం రూ. 169 కోట్ల నుంచి రూ. 720 కోట్లకు భారీగా పెరిగాయి. రాజకీయ, భౌగోళిక అనిశ్చితి ట్రెజరీ ఆదాయంపై ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. పూర్తి ఏడాదికి రూ. 1,561 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2024–25లో రూ. 1,613 కోట్లు ఆర్జించింది. కాగా.. వాటాదారులకు షేరుకి రూ. 0.6 డివిడెండ్‌ ప్రకటించింది.  
ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు 1.1% బలపడి రూ. 244 వద్ద ముగిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement