స్వల్పంగా పెరిగిన ‘హెక్సావేర్‌’ లాభం 

IT Company Hexware Technologies net profit margin is 2 percentage - Sakshi

న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ నికర లాభం డిసెంబర్‌ త్రైమాసికంలో 2 శాతం పెరిగి, రూ.123.4 కోట్లుగా నమోదయ్యింది. 2017 ఇదే కాలంలో ఈ మొత్తం రూ.120.9 కోట్లు. ఇక ఆదాయాలు 24.6 శాతం వృద్ధితో రూ.1,004.8 కోట్ల నుంచి రూ.1,252.4 కోట్లకు పెరిగాయి. కంపెనీ జనవరి–డిసెంబర్‌ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా భావిస్తోంది. ఈ ప్రాతిపదికన మొత్తం ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 16.8 శాతం పెరిగి రూ.583.5 కోట్లకు చేరింది. కాగా డిసెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ షేర్‌కు రూ.2.50 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top