మార్కెట్‌లో ఐఫోన్‌–8, 8 ప్లస్‌ సందడి

iPhone 8 and iPhone 8 Plus Review - Sakshi

న్యూఢిల్లీ: ఐఫోన్‌ యూజర్లకు శుభవార్త. యాపిల్‌ ఐఫోన్‌–8, 8 ప్లస్‌ ఫోన్ల నిరీక్షణకు తెరపడింది. శుక్రవారం నుంచి వీటి విక్రయాలు ప్రారంభమయ్యాయి. కాగా ఐఫోన్‌–10 హ్యాండ్‌సెట్లు మాత్రం నవంబర్‌ 3 నుంచి అందుబాటులోకి వస్తాయి. ఈ–కామర్స్‌ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్‌–8లో 4.7 అంగుళాల స్క్రీన్, 8 ప్లస్‌లో 5.5 అంగుళాల స్క్రీన్‌ ఉంటుంది. అలాగే వీటిల్లో వైర్‌లెస్‌ చార్జింగ్, ఏ11 బయోనిక్‌ చిప్‌సెట్, గ్లాస్‌ లేయర్‌తో కూడిన బ్యాక్‌ ప్యానెల్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయి. ఐఫోన్‌–8 ధర రూ.64,000 (64 జీబీ వేరియంట్‌), రూ.77,000 (256 జీబీ వేరియంట్‌)గా.. ఐఫోన్‌–8 ప్లస్‌ ధర రూ.73,000 (64 జీబీ వేరియంట్‌), రూ.86,000 (256 జీబీ వేరియంట్‌)గా ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌–8, 8 ప్లస్‌ ఫోన్ల కొనుగోలుపై యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులపై 5 శాతం తగ్గింపు పొందొచ్చు. అమెజాన్‌.. రిలయన్స్‌ జియోతో కలసి ఐఫోన్‌–8, 8 ప్లస్‌పై ప్రత్యేకమైన డీల్‌ ఆఫర్‌ చేస్తోంది. 12 నెలల తర్వాత కొత్త ఐఫోన్‌ కొనుగోలు సమయంలో ఈ ఫోన్‌పై 70 శాతం బైబ్యాక్‌ ఆఫర్‌ ఉంది.

అయితే ఇక్కడ కస్టమర్లు రూ.9,588 విలువైన జియో–ఐఫోన్‌ వార్షిక ప్లాన్‌ను (నెలకు రూ.799 ప్లాన్‌)ఎంచుకోవాలి. ఈ జియో బైబ్యాక్‌ ఆఫర్‌ను ముకేశ్‌ అంబానీ కుమారుడు, జియో డైరెక్టర్‌ ఆకాశ్‌ అంబానీ ప్రకటించారు.   ఐఫోన్‌–8, 8 ప్లస్‌ ఫోన్లలో హిందీ డిక్టేషన్‌ ఫీచర్‌ను పొందుపరిచామని యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ తెలిపారు. ఈ విషయాన్ని వీడియో మెసేజ్‌ ద్వారా వెల్లడించారు. అలాగే ఈ కొత్త ఐఫోన్లు భారత్‌లో 11 స్థానిక భాషలను సపోర్ట్‌ చేస్తాయని పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top