breaking news
iPhone 8 & 8 Plus
-
మార్కెట్లో ఐఫోన్–8, 8 ప్లస్ సందడి
న్యూఢిల్లీ: ఐఫోన్ యూజర్లకు శుభవార్త. యాపిల్ ఐఫోన్–8, 8 ప్లస్ ఫోన్ల నిరీక్షణకు తెరపడింది. శుక్రవారం నుంచి వీటి విక్రయాలు ప్రారంభమయ్యాయి. కాగా ఐఫోన్–10 హ్యాండ్సెట్లు మాత్రం నవంబర్ 3 నుంచి అందుబాటులోకి వస్తాయి. ఈ–కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్–8లో 4.7 అంగుళాల స్క్రీన్, 8 ప్లస్‌లో 5.5 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. అలాగే వీటిల్లో వైర్లెస్ చార్జింగ్, ఏ11 బయోనిక్ చిప్సెట్, గ్లాస్ లేయర్‌తో కూడిన బ్యాక్ ప్యానెల్ వంటి పలు ప్రత్యేకతలున్నాయి. ఐఫోన్–8 ధర రూ.64,000 (64 జీబీ వేరియంట్), రూ.77,000 (256 జీబీ వేరియంట్)గా.. ఐఫోన్–8 ప్లస్ ధర రూ.73,000 (64 జీబీ వేరియంట్), రూ.86,000 (256 జీబీ వేరియంట్)గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్–8, 8 ప్లస్ ఫోన్ల కొనుగోలుపై యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5 శాతం తగ్గింపు పొందొచ్చు. అమెజాన్.. రిలయన్స్ జియోతో కలసి ఐఫోన్–8, 8 ప్లస్‌పై ప్రత్యేకమైన డీల్ ఆఫర్ చేస్తోంది. 12 నెలల తర్వాత కొత్త ఐఫోన్ కొనుగోలు సమయంలో ఈ ఫోన్‌పై 70 శాతం బైబ్యాక్ ఆఫర్ ఉంది. అయితే ఇక్కడ కస్టమర్లు రూ.9,588 విలువైన జియో–ఐఫోన్ వార్షిక ప్లాన్‌ను (నెలకు రూ.799 ప్లాన్)ఎంచుకోవాలి. ఈ జియో బైబ్యాక్ ఆఫర్‌ను ముకేశ్ అంబానీ కుమారుడు, జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ ప్రకటించారు. ఐఫోన్–8, 8 ప్లస్ ఫోన్లలో హిందీ డిక్టేషన్ ఫీచర్‌ను పొందుపరిచామని యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. ఈ విషయాన్ని వీడియో మెసేజ్ ద్వారా వెల్లడించారు. అలాగే ఈ కొత్త ఐఫోన్లు భారత్‌లో 11 స్థానిక భాషలను సపోర్ట్ చేస్తాయని పేర్కొన్నారు. -
ఐ ఫోన్లు: జియో బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: రిలయన్స్ డిజిటల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆపిల్ ఐఫోన్ 8 , ఐ ఫోన 8 ప్లస్ వినియోగదారులకి ఒక సంవత్సరం తర్వాత తిరిగి ఇస్తే.. వీటి అసలు కొనుగోలు ధరలో 70 శాతం తిరిగి ఇవ్వనున్నట్టు వెల్లడించింది. రిలయన్స్ డిజిటల్, అమెజాన్, మై జియో.కాం జియో స్టోర్లలో ఈ సదుపాయం ఉన్నట్టు తెలిపింది అంతేకాదు సెప్టెంబర్ 22 -29వ తేదీల మధ్య రిలయన్స్ డిజిటల్ ద్వారా స్మార్ట్ ఫోన్లను ప్రీ బుకింగ్ చేస్తే రూ.10వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. సెప్టెంబర్ 29 లాంచింగ్ సందర్భంగా ఈ క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. అయితే ఈ ఆఫర్ సిటీ బ్యాంక్ క్రెడిట్ ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులకు మాత్రమే లభ్యం. అంతేకాదు ఐ ఫోన్లకు ప్రత్యేక తారిఫ్‌లను కూడా జియో ప్రకటించింది. ఐ ఫోన్ 8 లో పోస్ట్ పెయిడ్ ఖాతాదారులకు 28 రోజుల వాలిడిటీతో రూ. 799 ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్ సదుపాయంతోపాటు 90 జీబీ డేటా ఉచితం. అలాగే కాంప్లిమెంటరీ ప్రీమియం సభ్యత్వం కూడా. ఐ పోన్ 8, ఐఫోన్ 8ప్లస్ లను సెప్టెంబర్ 22 నుంచి రిలయన్స్ డిజిటల్, అమెజాన్, మై జియో.కాం జియో స్టోర్లలో ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే 29 నుంచి అన్ని స్టోర్లలో ఇవి లభ్యమవుతాయి. దీంతోపాటు ఐ ఫోన్ X కూడా ప్రీ ఆర్డర్ కూడా అక్టోబర్ 27 నుంచి, కొనుగోలుకు నవంబర్ 3నుంచి అందుబాటులో ఉంటుంది.