5 నిమిషాల్లో 60,000 మ్యాగీ కిట్స్ విక్రయం | In 5 minutes, 60000 Maggi kits get sold out on Snapdeal | Sakshi
Sakshi News home page

5 నిమిషాల్లో 60,000 మ్యాగీ కిట్స్ విక్రయం

Nov 13 2015 1:28 AM | Updated on Oct 8 2018 4:21 PM

5 నిమిషాల్లో 60,000 మ్యాగీ కిట్స్ విక్రయం - Sakshi

5 నిమిషాల్లో 60,000 మ్యాగీ కిట్స్ విక్రయం

మోతాదుకు మించి సీసం ఉందనే కారణంగా దాదాపు ఐదు నెలల నిషేధాన్ని ఎదుర్కొన్న తర్వాత మళ్లీ మార్కెట్‌లోకి వచ్చిన మ్యాగీ ఇన్‌స్టెంట్ నూడుల్స్ వెల్‌కమ్ కిట్స్ స్నాప్‌డీల్‌లో

న్యూఢిల్లీ: మోతాదుకు మించి సీసం ఉందనే కారణంగా దాదాపు ఐదు నెలల నిషేధాన్ని ఎదుర్కొన్న తర్వాత మళ్లీ మార్కెట్‌లోకి వచ్చిన మ్యాగీ ఇన్‌స్టెంట్ నూడుల్స్ వెల్‌కమ్ కిట్స్ స్నాప్‌డీల్‌లో కేవలం ఐదు నిమిషాల్లోనే 60,000 అమ్ముడుపోయాయి. నవంబర్ 9న మ్యాగీ కిట్స్ నమోదు ప్రక్రియ ప్రారంభమైతే.. వాటి అమ్మకాలు స్నాప్‌డీల్‌లో గురువారం ప్రారంభమయ్యాయి. కేవలం ఐదు నిమిషాల్లోనే తొలి బ్యాచ్‌కు చెందిన 60,000 మ్యాగీ కిట్స్ అమ్ముడుపోయాయి.

ఒక మ్యాగీ కిట్‌లో 12 మ్యాగీ ప్యాకెట్స్, 2016 మ్యాగీ క్యాలెండర్, మ్యాగీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, మ్యాగీ పోస్ట్‌కార్డ్స్, ఒక వెల్‌కమ్ బ్యాక్ లెటర్ ఉంటాయి. దీని ధర రూ.144గా ఉంది. అలాగే మరో కొత్త బ్యాచ్ మ్యాగీ కిట్స్ విక్రయాలు నవంబర్ 16న జరగనున్నాయి. మ్యాగీ విక్రయాలు ఇప్పటికే 300 డిస్ట్రిబ్యూటర్ల ద్వారా 100 పట్టణాల్లో పునఃప్రారంభమయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement