3 నెలల్లోనే 30 లక్షల విక్రయాలు | Honor 10 Global Sales Top 3 Million In Less Than 3 Months | Sakshi
Sakshi News home page

3 నెలల్లోనే 30 లక్షల విక్రయాలు

Jul 13 2018 3:50 PM | Updated on Jul 13 2018 3:52 PM

Honor 10 Global Sales Top 3 Million In Less Than 3 Months - Sakshi

హానర్‌ 10 స్మార్ట్‌ఫోన్‌

అదిరిపోయే ఫీచర్లతో హువావే ‘హానర్‌ 10’ స్మార్ట్‌ఫోన్‌ను గత మూడు నెలల క్రితమే గ్లోబల్‌గా లాంచ్‌ చేసిన తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌ గ్లోబల్‌ విక్రయాల్లో రికార్డులు సృష్టిస్తోంది. లాంచ్‌ చేసిన 3 నెలల వ్యవధిలోనే 30 లక్షల విక్రయాల మైలురాయిని తాకి, హానర్‌ 10 దూసుకుపోయింది. ఈ విషయాన్ని కంపెనీ తన అధికారిక ట్విటర్‌ అకౌంట్‌లో వెల్లడించింది. ‘30 లక్షల హానర్‌ 10 విక్రయాలు, 30 లక్షల మందికి కృతజ్ఞతలు. హానర్‌ 10కు సపోర్టు ఇచ్చిన హానర్‌ అభిమానులందరికీ అభినందనలు. మీ సాయం లేకుండా.. ఈ మైలురాయిని తాకడం సాధ్యమయ్యేది కాదు’ అని కంపెనీ ట్వీట్‌ చేసింది. లాంచ్‌ చేసిన నెలలోనే 1 మిలియన్‌ పైగా యూనిట్లు విక్రయమయ్యాయి. అంటే సగటున నెలకు 10 లక్షల యూనిట్లు విక్రయాలను నమోదు చేసింది.  ఆన్‌లైన్‌ రిటైలర్‌ షాపీలో కూడా హానర్‌ 10 బెస్ట్‌ సెల్లింగ్‌ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌గా నిలిచింది. రష్యా, ఫ్రాన్స్‌ల్లో కూడా ఈ స్మార్ట్‌ఫోనే బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌గా ఉంది. 

తొలుత హానర్‌ 10 స్మార్ట్‌ఫోన్‌ చైనా మార్కెట్‌లో లాంచ్‌ అయింది. అక్కడ లాంచ్‌ చేసిన రెండు నెలల అనంతరం గ్లోబల్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ హ్యాండ్‌ సెట్‌ ఖరీదు చైనాలో 2,599 సీఎన్‌వైగా, భారత్‌లో రూ.32,999గా ఉంది. భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది.  

హానర్ 10 స్పెసిఫికేషన్లు 
 5.84 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ నాచ్ డిస్ప్లే (ఐఫోన్ టెన్ మాదిరి) 
 హువాయి కిరిన్ 970 ప్రాసెసర్ 
 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 
24ఎంపీ + 16ఎంపీ డ్యుయల్ వెనుక కెమెరా, 24 ఎంపీ ఫ్రంట్ కెమెరా 
ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 3400 ఎంఏహెచ్ బ్యాటరీ 
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఈఎంయూఐ 8.1 ఇంటర్‌ఫేస్ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement