కారు కొంటే.. హోండా బంపర్‌ ఆఫర్‌

Honda offers paid trip to London, Paris on new car purchase - Sakshi

 హోండా కారు కొన్నవారికి  బంపర్‌  ఆఫర్‌

 నెలవారి డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లు

 ప్రత్యేక బహుమతిగా  లండన్‌, పారిస్‌ ట్రిప్‌

సాక్షి,న్యూఢిల్లీ: సెప్టెంబర్‌ 1నుంచి కార్ల ధరలు పెరిగాయని అందోళన పడుతున్నవారికి  ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా పండుగ కానుక అందిస్తోంది.  హోండా కారు కొనుగోలు చేసిన వినియోగదారులకు నెలవారీ విలువైన బహుమతులతోపాటు, ఒక బంపర్‌ ఆఫర్‌ ఉంటుందని  ప్రకటించింది.  దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా షోరూంలలో ప్రమోషనల్‌  ఆఫర్‌గా  తీసుకొచ్చిన ఈ ఆఫర్‌లో  లక్కీ డ్రా  గెలిచిన  కస్టమర్లకు  ఉచితంగా విదేశీ ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది.  తమ మోడల్‌  కార్లు అన్నింటిపైనా ఈ ఆఫర్‌ వర్తింస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

వార్షికోత్సవ వేడుకల సందర్భంగా భారతదేశంలో ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఈ ఆఫర్‌ను వెల్లడించింది. ది గ్రేట్ హోండా ఫెస్ట్ పేరుతో ప్రకటించిన  ఆఫర్‌లో  నెలవారీ డిస్కౌంట్లు, ఆఫర్లకు తోడుగా  మరో  గ్రాండ్‌ ప్రైజ్‌ను కూడా అందిచనున్నామని తెలిపింది.  ఇందులో  లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన కస్టమర్‌కు లండన్‌, పారిస్‌  టూర్‌ ఆఫర్‌ అందిస్తోంది.  సెప్టెంబర్‌ 1నుంచి నవంబరు7, 2018 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.

కారును కొనుగోలు చేసిన అనంతరం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ వెబ్‌సైట్‌  www.hondacarindia.లో రిజిస్టర్‌ కావాల్సి ఉంటుంది. నిర్దేశిత  కాలంలో బిల్లింగ్, డాక్యుమెంటేషన్ తదితర అన్ని  ఫార్మాలిటీస్‌ పూర్తి  చేసిన కస‍్టమర్లు ఈ ఆఫర్ పొందేందుకు అర్హులు.   బ్రియో  జాజ్, అమేజ్, డబ్యలువీఆర్‌-వీ, సిటీ, బీఆర్‌-వి ఎస్‌యూవీ , సీఆర్‌-వి,  అకార్డ్ హైబ్రిడ్‌ సహా అన్ని హోండా కార్ల కొనుగోళ్లపై ఆ ఆఫర్‌​ వర్తిస్తుంది.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top