హీరో సైకిల్స్ చేతికి బీఎస్ హెచ్ వెంచర్స్ | Hero Cycles acquires 60% stake in Sri Lanka's BSH Ventures | Sakshi
Sakshi News home page

హీరో సైకిల్స్ చేతికి బీఎస్ హెచ్ వెంచర్స్

Mar 24 2016 1:10 AM | Updated on Sep 3 2017 8:24 PM

హీరో సైకిల్స్ చేతికి బీఎస్ హెచ్ వెంచర్స్

హీరో సైకిల్స్ చేతికి బీఎస్ హెచ్ వెంచర్స్

శ్రీలంకకు చెందిన బీఎస్‌హెచ్ వెంచర్స్‌లో 60 శాతం వాటాను హీరో సైకిల్స్ కొనుగోలు చేసింది.

శ్రీలంక కంపెనీలో 60% వాటా కొనుగోలు

 

 న్యూఢిల్లీ: శ్రీలంకకు చెందిన బీఎస్‌హెచ్ వెంచర్స్‌లో 60 శాతం వాటాను హీరో సైకిల్స్ కొనుగోలు చేసింది. దీంతో హీరో సైకిల్స్ కంపెనీ ఆరు నెలల్లో మూడు కంపెనీలను కొనుగోలు చేసినట్లయింది.  అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేందుకు, అంతర్జాతీయంగా తమ స్థానాన్ని మరింత పటి ష్టం చేసుకునేందుకుగాను  బీఎస్‌హెచ్ వెంచర్స్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేశామని హీరో సైకిల్స్ తెలిపింది. ఈ శ్రీలంక సైకిల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచడానికి మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నామని హీరో సైకిల్స్ సీఎండీ పంకజ్ ముంజాల్ చెప్పారు. ఇంతకు ముందు హీరో సైకిల్స్ కంపెనీ ఇంగ్లాండ్‌కు చెందిన అవోసెట్ స్పోర్ట్స్, ఫైర్‌ఫాక్స్ బైక్స్ కంపెనీలను కొనుగోలు చేసింది. అవొసెట్ స్పోర్ట్స్ కొనుగోలుతో యూరప్ సైకిల్ మాస్ సెగ్మంట్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఫైర్‌ఫాక్స్ బైక్స్ కంపెనీ కొనుగోలు- భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రీమియం సైకిల్ సెగ్మెంట్‌లో హీరో స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement