ఐదేళ్లలో 280 బిలియన్ డాలర్లకు.. హెల్త్‌కేర్! | Healthcare $ 280 billion over five years | Sakshi
Sakshi News home page

ఐదేళ్లలో 280 బిలియన్ డాలర్లకు.. హెల్త్‌కేర్!

Sep 1 2015 1:37 AM | Updated on Sep 3 2017 8:29 AM

ఐదేళ్లలో 280 బిలియన్ డాలర్లకు.. హెల్త్‌కేర్!

ఐదేళ్లలో 280 బిలియన్ డాలర్లకు.. హెల్త్‌కేర్!

భవిష్యత్తులో భారత ఆర్థికాభివృద్ధిలో హెల్త్‌కేర్ రంగం ప్రధాన భూమిక పోషించనుంది...

ఫిక్కీ-కేపీఎంజీ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ:
భవిష్యత్తులో భారత ఆర్థికాభివృద్ధిలో హెల్త్‌కేర్ రంగం ప్రధాన భూమిక పోషించనుంది. 2011లో 74 బిలియన్ డాలర్లుగా ఉన్న హెల్త్‌కేర్ రంగం 2020 నాటికి 16 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్)తో 280 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఫిక్కీ-కేపీఎంజీ తన నివేదికలో పేర్కొంది. హెల్త్‌కేర్ రంగంపై ప్రభుత్వం అంతగా దృష్టి కేంద్రీకరించడం లేదని తెలిపింది. కేంద్రం ప్రస్తుతం హెల్త్‌కేర్ రంగంపై వెచ్చిస్తోన్న మొత్తం జీడీపీలో 4.2 శాతంగా ఉందని, ఇది ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా తక్కువని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement