ఉచిత వైద్యం ఉత్తిదే..! | Free medical Services in government hospitals are not good | Sakshi
Sakshi News home page

ఉచిత వైద్యం ఉత్తిదే..!

Oct 16 2026 4:21 AM | Updated on Oct 16 2026 4:21 AM

Free medical Services in government hospitals are not good

ప్రభుత్వాస్పత్రుల్లో సేవలు బాగోలేవు   

ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో రోగుల అసంతృప్తి

లంచాల కోసం వేధిస్తున్నారని ఆవేదన 

ఆస్పత్రులు అపరిశుభ్రంగా ఉంటున్నాయని వెల్లడి

ముఖ్యమంత్రి, వైద్యశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో సైతం ఆస్పత్రుల పనితీరు అధ్వానం

రోగుల ప్రాథమిక హక్కును సైతం వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంకాలరాస్తోంది. ఉచిత వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో లంచావతారులను పెంచి పోషిస్తోంది. జీవించే హక్కులో ఆరోగ్య హక్కు కూడా భాగమేనన్న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21ను విస్మరించడం విస్మయపరుస్తోంది. సర్కారు ఆస్పత్రులపై రోగుల చీదరింపులు, ఈసడింపులను ఐవీఆర్‌ఎస్‌ సర్వేలు స్పష్టీకరిస్తున్నా వైద్యశాఖలో స్పందన లేకపోవడం ధృతరాష్ట్రుడి పాలనను గుర్తుకు తెస్తోంది.

సాక్షాత్తూ సీఎం చంద్రబాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో అయినా ఆస్పత్రుల సేవలు మెరుగ్గా ఉండి ఉంటాయని ఆశపడిన రోగులు కూడా చిరాకుపడడం ప్రభుత్వ పాలనా వైఫల్యాన్ని కళ్లకు కడుతోంది. మందులు లేని, వైద్యులు రాని ఆస్పత్రులతో రోగుల ప్రాణాలకురక్షణ కల్పించాలనుకోవడం నేల విడిచి సర్కారు సాము చేయడమే..!  

సాక్షి, అమరావతి: ఉచిత వైద్యం అందదు..డబ్బు­లు ఇవ్వందే వైద్యం లేదు.. పరిశుభ్రత పట్టదు..వైద్యులు ఉండరు.. ఉచిత మందులు ఇవ్వరు. ఇదీ ప్రభుత్వాస్పత్రుల పనితీరు అంటూ రోగులు ఈస­డించుకుంటున్నారు. సర్కారు ఆస్పపత్రుల పని­­తీరుపై ప్రభుత్వం చేయిస్తున్న ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌ (ఐవీఆర్‌ఎస్‌) సర్వేలో రోగులు ఇదే విషయాన్ని నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నారు. 

పీహెచ్‌సీలు, సెకండరీ హెల్త్, డీఎంఈ ఆస్పత్రుల్లో సేవలు బాగోలేవని 30 శాతం మంది రోగులు వెల్లడించినట్టు ఈ సర్వే తెలియజేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, వైద్య శాఖ మంత్రి సత్య­కుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లోని ఆస్పత్రులు సైతం పనితీరులో ఘోరంగా అట్టడుగు స్థానాల్లో నిలవడం వెన్నుపోటు పార్టీ కూటమి పాలనలో వైద్య రంగం దుస్థితిని తేటతెల్లంజేస్తోంది. 

పబ్లిసిటీ స్టంట్‌..
స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అంటూ ప్రతి మూడో శనివారం సీఎం చంద్రబాబు వివిధ జిల్లాలకు వెళ్లి హడావుడి చేస్తున్నా­రు. పబ్లిసిటీ కోసం చేస్తున్న ఈ కార్యక్రమంపై శ్రద్ధ చూపుతున్న చంద్రబాబు రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో అపరిశుభ్రతను గాలికి వదిలేశారని, ఫలితంగానే ఆస్పత్రులు అధ్వానంగా మారా­యని రోగు­లు గగ్గోలు పెడుతున్నారు. ఆస్పత్రుల్లో పరిశుభ్రతపై ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో ప్రశ్నలు వేయగా డీఎంఈ పరిధిలోని ఆస్పత్రులు ఘోరంగా ఉంటున్నాయని ఏకంగా 44 శాతం మంది తెలిపారు. సెకండరీ హెల్త్‌ ఆస్పత్రుల్లో 37 శాతం, పీహెచ్‌సీల్లో పరిశుభ్రతను 37 శాతం మంది చీదరించుకున్నారు. 

లంచం ఇస్తేనే వైద్యం.. 
అనారోగ్యం బారినపడి ప్రభుత్వాస్పత్రులకు వెళితే అక్కడ లంచాల కోసం వేధిస్తున్నట్టు బడుగు బలహీన వర్గాలకు చెందిన రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. వీల్‌ చైర్, స్ట్రెచర్, బెడ్‌ ఇవ్వడానికి, ఇంకా వివిధ రకాల సేవలకు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నట్టు తేలింది. వైద్య సేవల కోసం లంచం డిమాండ్‌ చేశారా? అని డీఎంఈ ఆస్పత్రుల్లో సేవలు పొందిన రోగులను సర్వేలో ఆరా తీయగా 26 శాతం మంది అవుననే సమాధానం ఇచ్చారు. సెకండరీ హెల్త్‌ ఆస్పత్రుల్లో సేవలు పొందిన 27.2 శాతం, పీహెచ్‌సీలకు వెళ్లిన రోగులు 25 శాతం మేర లంచాల వేధింపులు ఎదుర్కొన్నట్టు తెలిపారు.  

పనితీరు పేలవం..  
ఆస్పత్రుల్లో సేవలు, వసతులపై ప్రభుత్వం చేయిస్తున్న సర్వేల్లో సీఎం చంద్రబాబు, ఆ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లోని ఆస్పత్రులే అట్టడుగు స్థానంలో ఉంటున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్‌ నెలలకు సంబంధించి నిర్వహించిన సర్వేల్లో డీఎంఈ పరిధిలో సీఎం సొంత జిల్లా తిరుపతి 30 శాతానికిపైగా రోగుల అసంతృప్తిని మూటగట్టుకుంది. వైద్య శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉ­మ్మ­డి అనంతపురంలో ఏకంగా 34 శాతానికిపైగా రోగులు ప్రభుత్వ వైద్య సేవలను చీదరించుకు­న్నా­రు. సెకండరీ హెల్త్‌ పరిధిలోని ఆస్పత్రులకు సంబంధించి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 30 శాతం మంది ప్రజలు సేవలు ఏ మాత్రం బాగోలేవని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement