హెచ్‌డీఎఫ్‌సీ, కార్పొరేషన్‌ బ్యాంక్‌ రేట్ల కోత | HDFC, Indiabulls Housing take on SBI, ICICI with cut in home loan rates | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ, కార్పొరేషన్‌ బ్యాంక్‌ రేట్ల కోత

Jan 4 2017 12:21 AM | Updated on Sep 5 2017 12:19 AM

హెచ్‌డీఎఫ్‌సీ, కార్పొరేషన్‌ బ్యాంక్‌ రేట్ల కోత

హెచ్‌డీఎఫ్‌సీ, కార్పొరేషన్‌ బ్యాంక్‌ రేట్ల కోత

వడ్డీరేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు, ఆర్థిక సంస్థల వరుసలో తాజాగా హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నిలిచాయి.

న్యూఢిల్లీ: వడ్డీరేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు, ఆర్థిక సంస్థల వరుసలో తాజాగా హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నిలిచాయి. దీనితోపాటు కార్పొరేషన్‌ బ్యాంక్,  పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకులు కూడా తమ మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎంసీఎల్‌ఆర్‌) ఆధారిత రుణ రేటును తగ్గించాయి. వేర్వేరుగా చూస్తే...

హెచ్‌డీఎఫ్‌సీ:  మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ను 0.45% వరకూ తగ్గించింది. రూ.75 లక్షల వరకూ రుణ రేటు వార్షికంగా 8.7%గా ఉంటుంది.  అంతకుమించి మొత్తాలపై రేటు 8.75%. మహిళా రుణ గ్రహీతలకు మరో 0.05% వరకూ రాయితీ ఉంది.

ఇండియా బుల్స్‌: ఇక ఇండియా బుల్స్‌ కూడా రుణ రేటును 0.45% వరకూ తగ్గిస్తున్నట్లు  ప్రకటించింది.

కార్పొరేషన్‌ బ్యాంక్‌: వార్షిక రేటును 0.7% తగ్గించింది. దీనితో ఈ రేటు 8.75 శాతానికి చేరింది.

పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌: బ్యాంక్‌ వార్షిక ఎంసీఎల్‌ఆర్‌ రేటు 0.8 శాతం తగ్గి, 8.75 శాతానికి దిగింది. డీమోనిటైజేషన్‌ నేపథ్యంలో బ్యాంకింగ్‌ వద్ద పెద్ద ఎత్తున లిక్విడిటీ నేపథ్యంలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌సహా ఇప్పటికే పలు బ్యాంకులు ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణ రేటును తగ్గించడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement