బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ యూజర్లకూ ఫ్రీ కాల్స్ | free calls for BSNL mobile users | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ యూజర్లకూ ఫ్రీ కాల్స్

Oct 19 2015 9:04 AM | Updated on Sep 3 2017 11:12 AM

బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ యూజర్లకూ ఫ్రీ కాల్స్

బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ యూజర్లకూ ఫ్రీ కాల్స్

ల్యాండ్‌లైన్, మొబైల్ కనెక్షన్లు కలిగిన బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు త్వరలో మొబైల్ ఫోన్స్ నుంచి ఉచిత కాల్ సౌకర్యాన్ని పొందనున్నారు.

న్యూఢిల్లీ: ల్యాండ్‌లైన్, మొబైల్ కనెక్షన్లు కలిగిన బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు త్వరలో మొబైల్ ఫోన్స్ నుంచి ఉచిత కాల్ సౌకర్యాన్ని పొందనున్నారు. దీపావళి నాటికి ఈ సౌకర్యాన్ని వినియోగదారులకు అందించడం కోసం బీఎస్‌ఎన్‌ఎల్ కన్వర్జన్సీ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

ఈ ప్లాట్‌ఫామ్ మొబైల్, ల్యాండ్‌లైన్ యూజర్లను అనుసంధానిస్తుంది. దీంతో ల్యాండ్‌లైన్ కనెక్షన్ కలిగిన వినియోగదారులు వారి బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ నుంచి రాత్రి పూట ఉచిత కాల్స్ చేసుకోవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, ఎండీ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. మొబైల్, ల్యాండ్‌లైన్ ఖాతాలను ఒకదానితో మరొకదాన్ని అనుసంధానం చేసుకోవచ్చని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement