బాస్‌ కోసం ఎఫ్‌బీ వేట.. | Facebook To Shuffle Top Management Of India Team | Sakshi
Sakshi News home page

బాస్‌ కోసం ఎఫ్‌బీ వేట..

Aug 9 2018 2:58 PM | Updated on Aug 9 2018 3:11 PM

Facebook To Shuffle Top Management Of India Team - Sakshi

కొలిక్కిరాని ఫేస్‌బుక్‌ ఇండియా కొత్త సారధి వేట..

సాక్షి, న్యూఢిల్లీ : గత ఏడాది నవంబర్‌ నుంచి బాస్‌ లేకుండా కార్యకలాపాలు సాగిస్తున్న ఫేస్‌బుక్‌ ఇండియా బృందానికి త్వరలోనే కొత్త సారథి నేతృత్వం వహించనున్నారు. ఎండీ ఉమాంగ్‌ బేడీ సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసేందుకు సంస్థను వీడటంతో అప్పటినుంచి ఫేస్‌బుక్‌ భారత టీం కెప్టెన్‌ లేకుండానే నెట్టుకొస్తోంది.

ఈ క్రమంలో ఫేస్‌బుక్‌ భారత్‌ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఇండియా హెడ్‌ కోసం కంపెనీ వేట సాగిస్తోంది. కంట్రీ హెడ్‌ను నియామకంతో పాటు టాప్‌మేనేజ్‌మెంట్‌ బృందంలో మార్పులు చేసేందుకు ఫేస్‌బుక్‌ సంసిద్ధమైంది.

మరోవైపు ఫేస్‌బుక్‌ ఇండియా హెడ్‌ కోసం ఇప్పటికే పలువురు దరఖాస్తు చేసుకోని ఇంటర్వ్యూలకూ హాజరయ్యారు. వీరిలో హాట్‌స్టార్‌ సీఈఓ అజిత్‌ మోహన్‌, టాటా స్కై సీఈవో హరిత్‌ నాగ్పాల్‌, స్టార్‌ ఇండియా ఎండీ సంజయ్‌ గుప్తా, కర్ణాటక మాజీ ఐటీ కార్యదర్శి శ్రీవత్స కృష్ణలు ఉన్నారు. అయితే ఇండియా హెడ్‌ ఎంపికపై ఎఫ్‌బీ ప్రయత్నాలు ఇంకా ఓ కొలిక్కిరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement