
శాన్ జోసె (అమెరికా): సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ త్వరలో కొత్త లుక్‌తో దర్శనమివ్వనుంది. ఈ డిజైన్‌ను ’ఎఫ్‌బీ5’గా వ్యవహరిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జకర్‌బర్గ్ చెప్పారు. ఎఫ్8 పేరిట నిర్వహిస్తున్న వార్షిక టెక్నాలజీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. కొత్త డిజైన్ పనితీరు మరింత సులభతరంగా, వేగవంతంగా ఉంటుందని ఆయన చెప్పారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా ప్రవేశపెడుతున్నామన్నారు. ఫేస్‌బుక్ యాప్‌లో ఈ మార్పులు తక్షణం కనిపిస్తాయని, మరికొద్ది నెలల్లో డెస్క్‌టాప్ సైట్‌లో కూడా వీటిని చూడొచ్చన్నారు. ఫేస్‌బుక్ డేటింగ్ సర్వీసుల్లో సీక్రెట్ క్రష్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నామని జకర్‌బర్గ్ చెప్పారు.
కొత్తగా బ్రెజిల్, మలేషియా తదితర 14 దేశాల్లో దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. ఈ జాబితాలో భారత్ లేదు. మరోవైపు, మెసెంజర్ యాప్‌ను కూడా తేలికగా, వేగవంతంగా మారుస్తున్నామని జకర్‌బర్గ్ తెలిపారు. భారత్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్‌ను ఈ ఏడాది ఆఖరు నాటికి ఇతర దేశాల్లోనూ ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. మరోవైపు, ప్రైవసీ, డేటా భద్రతపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు జకర్‌బర్గ్ చెప్పారు. ఎన్నికల వేళ అనుచిత విధానాలతో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయకపోతే కఠిన చర్యలు తప్పవంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కేంద్రం గట్టిగా హెచ్చరించిన సంగతి తెలిసిందే.