మారుతి కార్లపై భారీ తగ్గింపు ధరలు

Discounts Of Up To Rs 55 000 On Maruti Suzuki Cars - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మారుతి  సుజుకి తన కార్లపై భారీ  తగ్గింపును అందిస్తోంది.  మారుతీ సుజుకీ   ప్రధాన డీలర్‌ షిప్‌ నెక్సా ద్వారా  విక్రయిస్తున్న  కార్లపై సూపర్ డీల్స్ అందిస్తోంది. ఎంపిక చేసిన వివిధ మోడళ్లపై  సుమారు రూ.60 వేల వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది.  ​ ఏప్రిల్ నెలలో మాత్రమే ఈ డిస్కౌంట్ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది.  సియాజ్‌, బాలెనో, ఎస్‌-క్రాస్‌, ఇగ్నిస్‌  కార్లపై ఈ డిస్కౌంట్‌ రేట్లు అందుబాటులో ఉన్నాయి. 

ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్‌ పై రూ.33 వేల దాకా తగ్గింపును అందిస్తోంది.  ఇందులో  15 వేల రూపాయల డిస్కౌంట్‌, 15 వేల వరకు  ఎక్స్చేంజ్‌ ఆఫర్‌, రూ. 3 వేల కార్పొరేట్‌  డిస్కౌంట్‌  ఉన్నాయి.  అలాగే  నెక్సా డీలర్‌ షిప్‌ కింద పరిచయమైన మొదటి  మోడల్‌ కార్‌  ఎస్‌-క్రాస్‌పై ఏకంగా రూ.55 వేల డిస్కౌంట్‌  లభిస్తుంది. ఇందులో  20 వేల రూపాయల డిస్కౌంట్‌, రూ. 25 వేల ఎక్స్చేంజ్‌ ఆఫర్‌,  రూ. 10 వేల కార్పొరేట్‌ డిస్కౌంట్స్‌ ఉన్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top