చిదంబరానికి మరోసారి ఊరట

Delhi HC extends interim protection to Chidambaram - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌నేత పి.చిదంబరానికి మరోసారి ఊరట లభించింది. ఆగస్టు1వ తేదీ వరకు చిదంబరంను అరెస్టు చెయ్యొద్దని ఢిల్లీ హైకోర్టు మంగళవారం  ఆదేశాలు జారీ చేసింది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు నేటితో ముగియనుంది.  ఈ నేపథ్యంలో మరో నెల రోజుల పాటు గడువును పొడిగించాల్సిందిగా చిదంబరం కోర్టును కోరారు. ఆయన విజ్ఞప్తిని పరిశీలించిన జస్టిస్‌ ఎ.కె.పాథక్ ఇందుకు అంగీకరించారు. దీనికి సంబంధించి ఎలాంటి అరెస్టు చేపట్టవద్దని సీబీఐని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణకు ఆగస్టు 1కి వాయిదా వేశారు.

కాగా ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2007లో  చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నసమయంలో  దాదాపు రూ. 305 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపిబి)  ద్వారా  అక్రమ విదేశీ నిధులను స్వీకరించారని ఆరోపిస్తూ సీబీఐ సిఐడి గత మే 15న కేసు నమోదు చేసింది  ఈ కేసులో  చిదంబరం కుమారుడు కార్త  అరెస్ట్‌అయ్యి, బెయల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top