తప్పుడు ప్రచారం: అదంతా నల్లధనం కాదు

Campaign regarding money parked by Indians in Swiss banks ill-informed, says Jaitley  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: స్విస్‌ బ్యాంకులో భారతీయుల డిపాజిట్లు 50శాతం పుంజుకున్నాయన్నవార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. స్విస్ బ్యాంకుల్లో జమ చేసిన మొత్తం డబ్బు "చట్టవిరుద్ధం" కాదని పేర్కొన్నారు. స్విస్‌బ్యాంకుల్లో అక్రమ డిపాజిట్లపై తప్పుడు 'తప్పుడు ప్రచారం' జరుగుతోందని జైట్లీ శుక్రవారం తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో రాశారు. స్విస్‌ బ్యాంకుల్లో డిపాజిట్‌ అయిన మొత్తం నల్లదనం కాదని జైట్లీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నల్లధనానికి అడ్డుకట్ట వేయడానికి చేస్తున్న ప్రయత్నాలు అంత క్రియాశీలకంగా లేవన్న అంచనాలను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై బహిరంగ వ్యాఖ్యలు చేసేవారు బేసిక్‌ వాస్తవాలను అర్థం చేసుకోవాలన్నారు.

తాజాగా స్విస్ బ్యాంకులో దాదాపు రూ.7000 కోట్ల వరకు పలువురు భారతీయులు పెట్టుబడులు పెట్టారన్నవార్తలపై ఆయన స్పందించారు. గతంతో పోల్చుకుంటే 50 శాతం వరకు నల్లధనం నిల్వలు స్విస్ బ్యాంకులో పెరిగాయని పలు పత్రికలు రాసిన వార్తల పట్ల జైట్లీ అసహనం వ్యక్తం చేశారు. స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకున్న వారందరూ నల్లధనాన్ని దాచినట్లు కాదని ఆయన అన్నారు. అలాంటి అక్ర లావాలదేవీలపై కఠినంగా వ్యవరిస్తామన్నారు. నల్లధనాన్ని దాచే ప్రతి ఒకరిపై కూడా తీవ్రస్థాయిలో పెనాల్టీ ఉంటుందని జైట్లీ తెలియజేశారు. స్విట్జర్లాండ్, భారత్ దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం జనవరి 1, 2018 తేది నుండి ఇప్పటి వరకు అక్కడి బ్యాంకులలో భారతీయుల లావాదేవీలకు సంబంధించిన సమాచారం మొత్తం మన దేశానికి అందుతుంది. అలాంటప్పుడు అక్కడ భారతీయులు పలు ఆర్థిక లావాదేవీలు జరిపినంత మాత్రాన.. వారు నల్లధనాన్ని దాచుకుంటున్నారని భావించనవసరం లేదని జైట్లీ స్పష్టం చేశారు.

ప్రభుత్వం తన తొలి అయిదు సంవత్సరాల కాలం పూర్తి అయ్యే నాటికి టాక్స్‌ రిటర్న్స్‌ దాఖలు చేసేవారి శాతం గణనీయంగా పెరగనుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అభిప్రాయపడ్డారు. ఈ నాలుగేళ్లలో ఆదాయ పన్ను దాఖలు చేసేవారి సంఖ్య 57శాతం పుంజుకుందన్నారు. గత ఏడాది ఆదాయ ప​న్నుల వసూళ్లు 18శాతం పెరిగాయనీ  జైట్లీ పేర్కొన్నారు. కాగా 2017 డేటా ప్రకారం స్విస్ బ్యాంకులో భారతీయుల డిపాజిట్లు 50శాతం పెరిగి1.01 బిలియన్ డాలర్ల (సుమారు రూ .7,000 కోట్లు)గా నమోదయ్యాయి. అలాగే విదేశీయుల లావాదేవీలు 3 శాతం వరకు పెరిగి 1.46 ట్రిలియన్ స్విస్ ఫ్రాంకులు( సుమారు 100 లక్షల కోట్ల రూపాయలుగా) ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top