నమ్మకం, నాణ్యతలే ముఖ్యం! | Believe that quality is important! | Sakshi
Sakshi News home page

నమ్మకం, నాణ్యతలే ముఖ్యం!

Jun 28 2014 12:27 AM | Updated on Sep 2 2017 9:27 AM

నమ్మకం, నాణ్యతలే ముఖ్యం!

నమ్మకం, నాణ్యతలే ముఖ్యం!

ప్రతికూల పరిస్థితుల్లోనూ స్థిరాస్తి రంగంలో నిలదొక్కుకోవడమంటే మాటలు కాదు. కానీ, ఎస్‌ఎంఆర్ సంస్థ నాలుగేళ్లలో 4 మిలియన్ చ.అ. విస్తీర్ణంలో (హైదరాబాద్, బెంగళూరుల్లో కలిపి) పలు ప్రాజెక్టులను పూర్తి చేసింది.

నాలుగేళ్లలో 4 మిలియన్ చ.అ.లను అభివృద్ధి చేసిన ఎస్‌ఎంఆర్ సంస్థ
 
 హైదరాబాద్: ప్రతికూల పరిస్థితుల్లోనూ స్థిరాస్తి రంగంలో నిలదొక్కుకోవడమంటే మాటలు కాదు. కానీ, ఎస్‌ఎంఆర్ సంస్థ నాలుగేళ్లలో 4 మిలియన్ చ.అ. విస్తీర్ణంలో (హైదరాబాద్, బెంగళూరుల్లో కలిపి) పలు ప్రాజెక్టులను పూర్తి చేసింది. గడువు లోగా నిర్మాణం పూర్తి చేయటం, నమ్మకం, నాణ్యతలే సంస్థ రహస్యమని సంస్థ సీఎండీ రాం రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..

1.     బండ్లగూడలో 13 ఎకరాల్లో ఎస్‌ఎంఆర్ వినయ్ హార్మోనీ కౌంటీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మూడు ఫేజుల్లో పూర్తికానున్న ఈ ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం ఫేజ్-1లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 30 నెలల్లో రెండు బ్లాకుల్లో 450 ఫ్లాట్లను కొనుగోలుదారులకు అందిస్తాం. ఫేజ్-2లో 700 ఫ్లాట్ల పనులను మూడు నెలల్లో ప్రారంభిస్తాం. చివరగా ఫేజ్-3లో మరో 150 ఫ్లాట్లను కూడా నిర్మిస్తాం. ఇక ధర విషయానికొస్తే చ.అ.కి రూ.3,200 లుగా నిర్ణయించాం. ఇదే ప్రాంతంలో 30 ఎకరాల్లో 200 లగ్జరీ విల్లాలను కూడా నిర్మించనున్నాం. ఒక్కో విల్లా ఖరీదు రూ.2-3 కోట్లుగా ఉంటుంది.
2.    మియాపూర్‌లో 1.7 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో ‘ఎస్‌ఎంఆర్ వినయ్ మెట్రో’ షాపింగ్ విత్ కమర్షియల్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో 4 స్క్రీన్ల మల్టిప్లెక్స్ రానుంది. ఇదే ప్రాంతంలో మరో 6 లక్షల చ.అ. విస్తీర్ణంలో మరో భారీ ప్రాజెక్ట్‌ను కూడా నిర్మిస్తున్నాం. ఇందులో నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మిస్తాం. ఇందులో 6 స్క్రీన్ల మల్టిప్లెక్స్ వస్తుంది.
3.    అన్ని ప్రాజెక్టుల్లోనూ అధిక శాతం స్థలాన్ని పచ్చదనానికే కేటాయిస్తున్నాం. ఇండోర్, ఔట్ డోర్ ఆట స్థలాలు, క్లబ్ హౌస్, వాకింగ్, స్కేటింగ్ ట్రాక్స్,  స్విమ్మింగ్‌పూల్ వంటి అనేక రకాల ఆధునిక సౌకర్యాలనూ ఏర్పాటు చేస్తున్నాం.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement