Chhattisgarh: Fire Broke Out At A Commercial Complex In Korba - Sakshi
Sakshi News home page

షాపింగ్ కాంప్లెక్స్‌లో మంటలు..ప్రాణాల కోసం ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకి..

Jun 19 2023 6:32 PM | Updated on Jun 19 2023 8:09 PM

Fire At Commercial Complex In Chhattisgarh Korba - Sakshi

ఛత్తీస్‌గఢ్‌:ఛత్తీస్‌గఢ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకోగా..ఊపిరాడక ముగ్గురు మృతి చెందారు. కోర్భా జిల్లాలోని ‍ట్రాన్స్‌పోర్టు నగర్‌ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగింది. 

షాపింగ్ కాంప్లెక్స్‌ వినియోగదారులతో కిటకిటలాడుతుంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న మాల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో కాంప్లెక్స్‌లో ఉన్న జనం బయటకు పరుగులు తీశారు. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న వినియోగదారులు మంటల నుంచి తప్పించుకోవడానికి కిందకు దూకారు. 

షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు దాని చుట్టూ ఉన్న దుకాణాలకు కూడా మంటలు చుట్టుముట్టాయి. వాటి పక్కనే ఉన్న ఓ బ్యాంకు కూడా మంటల్లో దగ్దమయ్యింది. అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:కుక్కలా అరవమని వేధిస్తూ..యువకుల పిచ్చి చేష్టలు..

   

Advertisement
 
Advertisement
Advertisement