అమెజాన్‌కు ఏమైంది? ఇండియన్‌ పోర్టల్‌లో డేటా లీక్‌

Another data breach? Amazon India leaks sellers information in tech error - Sakshi

ఒకవైపు మార్కెట్‌ క్యాప్‌లో అమెరికాకు చెందిన ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా  అవతరించింది.  మరోవైపు టీవీ యాంకర్‌తో ప్రేమలో పడిన అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ భార్యకుతో విడాకులకు సిద్ధం..ఇంకోవైపు అమెజాన్‌లో విక్రయదారుల భారీ డేటాలీక్‌తో అమెజాన్‌ వార్తల్లో నిలిచింది. అంతర్గత వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా పలు అమెజాన్‌ ఇండియా పోర్టల్‌లో విక్రయదారుల డేటా లీక్‌ అయింది. ముఖ్యంగా సెల్లర్స్‌ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల సమాచారం చోరీకి గురైంది. వీరి అమ్మకాలకు సంబంధించిన నెలవారీ ఆర్థిక లావాదేవీల వివరాలు, ఇతరాలు  అక్రమంగా  బహిర్గతం కావడం  కలకలం  రేపింది. 

వరుస డేటాలీక్స్‌ సోషల్‌ మీడియా యూజర్లను ఆందోళనలోకి నెట్టివేస్తున్నాయి. ఫేస్‌బుక్‌ ఖాతాల డేటాబ్రీచ్‌ ప్రకంపనలు ఇంకా చల్లారకముందే తాజాగా అమెజాన్‌ ఇండియాలో మరో డేటా బ్రీచ్‌ కలకలం రేపింది. అమెజాన్‌లో నమోదైన సెల్లర్స్‌ ఆర్థిక లావాదేవీల వివరాలు అక్రమంగా ప్రత్యర్థి విక్రయాదారులతోపాటు, ఇతరులకు కూడా అందాయి. దీన్ని అమెజాన్‌ ఇండియా ధృవీకరించింది. విక్రయదారులు డౌన్‌లోడింగ్‌ సందర్భంగా సమస‍్యలు తలెత్తడంతో డేటా బ్రీచ్‌ అంశాన్ని గమనించామని వెల్లడించింది. అయితే సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి వెంటనే  చర్యలు చేపట్టామని ప్రకటించింది.  అయితే  ఈ ప్రభావానికి గురైన అమ్మకందారుల సంఖ్యను మాత్రం బహిర్గతం చేయలేదు.  

కాగా అమెజాన్‌లో దాదాపు150 మిలియన్ల రిజిస్టర్డ్‌ యూజర్లు వుండగా, సుమారు 40 లక్షలమంది విక్రయదారులుగా నమోదయ్యారు. ఈ నేపథ‍్యంలో తాజా డాటాలీక్‌ ప్రభావానికి ఎంతమంది  గురయ్యారు? ఎంతమంది సెల్లర్స్‌  ఫిర్యాదు చేశారనే దానిపై  స్పష్టత లేదు. గత ఏడాది కూడా అమెజాన్‌లో దాదాపు  ఇలాంటి సమస్యే తలెత్తింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top