
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2018-19 బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి చేసిన కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. 2017-18తో పోల్చితే ఈ రంగానికి కేటాయింపులు నామమాత్రంగానే పెరిగాయి. గత బడ్జెట్‌లో ఎస్‌సీ సంక్షేమానికి రూ. 52,393 కోట్లు, ఎస్‌టీ సంక్షేమానికి రూ. 31,920 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్‌లో ఈ రంగాలకు రూ. 56,619, రూ. 39,135 కోట్లు కేటాయించారు.
ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి నిధుల కేటాయింపు స్వల్పంగా పెరగడం గమనార్హం. గ్రామీణ, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెబుతూనే కీలక ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి సంక్షేమానికి మొక్కుబడి కేటాయింపులు జరిపారు.