అమ్మకాల్లో అగ్రస్థానం ఆల్టో

Alto is in top in selling  - Sakshi

టాప్‌–10లో 6 మారుతీవే  

న్యూఢిల్లీ: భారత్‌లో గత నెలలో అత్యధికంగా అమ్ముడైన పది కార్లలో మారుతీ సుజుకీ కంపెనీ కార్లు ఆరు చోటు సంపాదించాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్ల తొలి ఐదు స్థానాల్లో మారుతీ కార్లే ఉన్నాయని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌) వెల్లడించింది, హ్యుందాయ్‌ కంపెనీకి చెందిన మూడు కార్లు ఈ జాబితాలో ఉండగా,  మహీంద్రాకు చెందిన యుటిలిటి . వెహికల్‌ బొలెరోకు రెండేళ్ల తర్వాత  స్థానం లభించింది. దాదాపు రెండేళ్ల తర్వాత బాగా అమ్ముడైన టాప్‌ 10 కార్లలో ఈ కారుకు చోటు దక్కింది.  

ఈ జాబితాలో మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన ఆల్టో అగ్రస్థానంలో నిలిచింది. గత నెలలో మొత్తం 19,760 ఆల్టో కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలలో 19,524 ఆల్టో కార్లు అమ్ముడయ్యాయి.  
 గత ఏడాది ఫిబ్రవరి జాబితాలో ఐదో స్థానంలో ఉన్న స్విప్ట్‌ కారు  ఈఏడాది ఫిబ్రవరి జాబితాలో మూడో స్థానానికి ఎగబాకింది.  
 గత ఏడాది టాప్‌–10 జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్న మారుతీ బాలెనో ఈ సారి ఏకంగా నాలుగో స్థానంలోకి దూసుకువచ్చింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top