ఎయిర్టెల్ ఎం-కామర్స్ ఇక ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ | Sakshi
Sakshi News home page

ఎయిర్టెల్ ఎం-కామర్స్ ఇక ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్

Published Wed, May 4 2016 12:42 AM

ఎయిర్టెల్ ఎం-కామర్స్ ఇక ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ - Sakshi

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీ భారతి ఎయిర్‌టెల్ తాజాగా తన అనుబంధ కంపెనీ ‘ఎయిర్‌టెల్ ఎం-కామర్స్ సర్వీసెస్’ పేరును ‘ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్’గా మార్పు చేసింది. అలాగే సంస్థ తన పేమెంట్ బ్యాంక్ కార్యకలాపాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రారంభించే అవకాశముంది. ‘పేరు మార్పు పేమెంట్స్ బ్యాంక్ విభాగంపై మాకున్న ఆసక్తికి నిదర్శనం. కంపెనీకున్న బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్.. మేము ప్రజలకు నాణ్యమైన బ్యాంకింగ్ సేవలను అందించడానికి దోహ దపడుతుంది’ అని భారతి ఎయిర్‌టెల్  (ఇండియా, దక్షిణాసియా) ఎండీ, సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. కాగా ఆర్‌బీఐ నుంచి పేమెంట్స్ బ్యాంక్ లెసైన్స్ పొందిన (ఏప్రిల్ 11న) తొలి కంపెనీ భారతి ఎయిర్‌టెల్.

Advertisement
 
Advertisement