హీలియోస్‌ లైఫ్‌ స్టైల్‌లో 30 శాతం వాటా ఇమామికి

30% share in Hiliyos's lifestyle - Sakshi

ఏడాది డిసెంబర్‌ కల్లా  కొనుగోలు పూర్తి  

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఇమామి.. హీలియోస్‌ లైఫ్‌ స్టైల్‌లో 30 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. మేల్‌ గ్రూమింగ్‌ (పురుష సౌందర్య సంబంధిత ఉత్పత్తులు) బ్రాండ్‌.. ‘ద మ్యాన్‌ కంపెనీ’ యాజమాన్య సంస్థ అయిన హీలియోస్‌ లైఫ్‌ స్టైల్‌లో వచ్చే ఏడాది చివరికల్లా 30 శాతం వాటాను కొనుగోలు చేస్తామని ఇమామి తెలిపింది.

వాటా కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలను ఇమామి వెల్లడించలేదు. ఈ వాటా కొనుగోలుతో వేగంగా వృద్ధి్ద చెందుతున్న ఆన్‌లైన్‌ మేల్‌ గ్రూమింగ్‌ సెగ్మెంట్లోకి  ప్రవేశించినట్లవుతుందని ఇమామి డైరెక్టర్‌ హర్ష వి అగర్వాల్‌ చెప్పారు. 

Back to Top