గ్రహం అనుగ్రహం (28-06-2020) | Daily Horoscope In Telugu (28-06-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (28-06-2020)

Jun 28 2020 6:32 AM | Updated on Jun 28 2020 6:35 AM

Daily Horoscope In Telugu (28-06-2020) - Sakshi

శ్రీ శార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి శు.అష్టమి రా.12.15 వరకు తదుపరి నవమి నక్షత్రం ఉత్తర ఉ.9.08 వరకు తదుపరి హస్త వర్జ్యం సా.4.56 నుంచి 6.27 వరకు
దుర్ముహూర్తం సా.4.45 నుంచి 5.37 వరకు అమృతఘడియలు...రా.1.54 నుంచి 2.34 వరకు
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
సూర్యోదయం : 5,31
సూర్యాస్తమయం :  6.34

దినఫలాలు....(ఆదివారం, 28.06.20)
మేషం...
రాబడి కంటే ఖర్చులు అధికం. కార్యక్రమాలలో అవాంతరాలు. బంధువిరోధాలు. శారీరక రుగ్మతలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

వృషభం...
కష్టపడ్డా ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. కళాకారులకు ఒత్తిళ్లు.

మిథునం...
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు.వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దూరప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. ధనలబ్ధి. ఉద్యోగులకు బాధ్యతలు తగ్గుతాయి.

కర్కాటకం...
ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. 

సింహం..
నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు.

కన్య...
ప్రయాణాలు వాయిదా. కార్యక్రమాలలో  అవరోధాలు. స్నేహితులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.

తుల...
కార్యక్రమాలు  విజయవంతంగా పూర్తి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆలయ దర్శనాలు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

వృశ్చికం..
ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు తగ్గుతాయి. దేవాలయ దర్శనాలు.

ధనుస్సు...
కుటుంబ, ఆరోగ్యసమస్యలు. కార్యక్రమాలు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. వృథా ఖర్చులు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు పనిభారం.

మకరం...
అనుకోని ఖర్చులు. కుటుంబసమస్యలు. శారీరక రుగ్మతలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో బదిలీలు.  దేవాలయ దర్శనాలు. ప్రయాణాలు వాయిదా.

కుంభం..
కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. భూ, వాహనయోగాలు. ముఖ్య నిర్ణయాలు.  వ్యాపారాలు,ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

మీనం..
ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. దేవాలయ దర్శనాలు.శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. వాహనయోగం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement