
శక్తులన్నింటిలోకి యువశక్తి గొప్పది
శక్తులన్నింటిలోకి యువశక్తి గొప్పదని పౌరసంబంధాలు, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు.
అనంతపురం ఎడ్యుకేషన్ : శక్తులన్నింటిలోకి యువశక్తి గొప్పదని పౌరసంబంధాలు, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ కళాశాలల విద్యార్థులకు యువతరంగం రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. రంగస్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభకు ముఖ్యఅతిథిగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజరయ్యూరు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ శతవసంతాలు పూర్తి చేసుకోబోతున్న ప్రతిష్టాత్మక ఆర్ట్స్ కళాశాలలో ఈ క్రీడలు జరగడం హర్షణీయమన్నారు. క్రీడలు మనలోని నైపుణ్యాలను వెలికితీస్తాయని తెలిపారు. మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వానికి దోహదపడుతుందన్నారు. చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువతరంపై ఆధారపడి ఉందన్నారు. క్రీడల ద్వారా అనంతపురం జిల్లాకీర్తిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మాట్లాడుతూ విద్యావిధానంలో క్రీడలు పాఠ్యాంశంగా చేసే చట్టాలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే బాలబాలికలకు ఆడుకునే అవకాశం కల్పించే పరిస్థితులు నేటి విద్యాలయాల్లో తీసుకురావాలని కోరారు.
తొలుత ప్రదర్శించిన చిన్నారుల నృత్యాలు, ఆర్ట్స్ కళాశాల విద్యార్థినుల లంబాడి నృత్యాలు ఆకట్టుకున్నాయి. నగర డెప్యూటీ మేయర్ సాకే గంపన్న, వైస్‌ప్రిన్సిపల్ డాక్టర్ శైలజ, వ్యాయామ విభాగాధిపతి వెంకటనాయుడు, పీడీ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ముస్తపా కమాల్‌బాషా, నటానియల్, పీడీ సూరిబాబు, అధ్యాపకులు ఏసీఆర్ దివాకర్‌రెడ్డి, రఘురామమూర్తి, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
తొలిరోజు అథ్లెటిక్ విజేతలు వీరే.. 800 మీటర్ల పరుగు పందెం పురుషుల విభాగం :
కే. మనోహర్ (అనంతపురం) ప్రథమ, టి.యువరాజ్ (చిత్తూరు) ద్వితీయ, ఎం. గోపాల్ (కర్నూలు) తృతీయ.
800 మీటర్ల పరుగు పందెం మహిళల విభాగం :
ఎం. వెంకటేశ్వరి (కర్నూలు) ప్రథమ, ఏ.సరోజిని (విజయనగరం) ద్వితీయ, వి.ధనలక్ష్మి(శ్రీకాకుళం) తృతీయ.
100 మీటర్ల పరుగు పందెం
పురుషుల విభాగం :
ఎస్. మధు (అనంతపురం) ప్రథమ, టి.యువరాజ్ (చిత్తూరు) ద్వితీయ, ఎం. వెంకటేశ్వరనాయక్ (కర్నూలు) తృతీయ.
100 మీటర్ల పరుగు పందెం
మహిళల విభాగం :
డి.ఆషాబీ (అనంతపురం) ప్రథమ, దుర్గాభవాని (తూర్పుగోదావరి) తృతీయ, కె.రుద్ర గంగాదేవి (విశాఖపట్నం) తృతీయ.
షాట్‌ఫుట్ పురుషుల విభాగం :
వి.విశ్వనాథ్ (కడప) ప్రథమ, బి.వెంకటేష్ (గుంటూరు) ద్వితీయ, ఎస్సీ కిశోర్‌రాజు (చిత్తూరు) తృతీయ.
షాట్‌ఫుట్ మహిళల విభాగం :
వై.వి.శ్వేత (కడప) ప్రథమ, వి.అపర్ణ (అనంతపురం) ద్వితీయ, కె. దుర్గాభవాని (తూర్పుగోదావరి) తృతీయ.
హైజంప్ మహిళల విభాగం :
ఆర్.ప్రియాంక (శ్రీకాకుళం) ప్రథమ, పి.కరుణ (పశ్చిగోదావరి) ద్వితీయ, పి.లలిత (అనంతపురం) తృతీయ.
డిస్కస్‌త్రో మహిళలు : బి.గురులక్ష్మి (కడప) ప్రథమ, కె.దుర్గాభవాని (తూర్పుగోదావరి) ద్వితీయ, ఏ.పుష్ప (విశాఖపట్నం) తృతీయ.