షర్మిలపై బురద చల్లడం గర్హనీయం | ysrcp women's mp's support to sharmila | Sakshi
Sakshi News home page

షర్మిలపై బురద చల్లడం గర్హనీయం

Jun 15 2014 12:42 AM | Updated on Oct 22 2018 6:02 PM

షర్మిలపై బురద చల్లడం గర్హనీయం - Sakshi

షర్మిలపై బురద చల్లడం గర్హనీయం

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలపై బురదజల్లి అప్రతిష్టపాలు చేసేందుకు యత్నించడం గర్హనీయమని మహిళా ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దుష్ర్పచారంపై వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా ఎంపీల ధ్వజం

హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలపై బురదజల్లి అప్రతిష్టపాలు చేసేందుకు యత్నించడం గర్హనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలు కొత్తపల్లి గీత(అరకు), బుట్టా రేణుక(కర్నూలు) శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఎదుగుతున్న ఒక మహిళా నాయకురాలిపై సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

రాజకీయ కారణాలతో షర్మిలపై అభూత కల్పనలు సృష్టించి ప్రచారం చేయడమనేది దిగజారుడు చర్య అని వారు పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు, వెబ్‌సైట్లు షర్మిలపై తప్పుడు ప్రచారం చేయడాన్ని సమాజంలో మనసున్న ప్రతి మహిళా ప్రతిఘటించాలని, తనపై జరుగుతున్న దుష్ర్పచారంపై ఆమె చేస్తున్న పోరాటంలో తాము వెంట నిలుస్తామని గీత పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement