గుంటూరు జిల్లాలో కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లను నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శనివారం పరిశీలించారు.
'సమీక్షలు జరిగినా చర్యల్లేవు'
Feb 27 2016 1:58 PM | Updated on May 29 2018 2:33 PM
కోటప్పకొండ: గుంటూరు జిల్లాలో కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లను నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శనివారం పరిశీలించారు. వచ్చే నెల 7న శివరాత్రి మహోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంతవరకు తిరునాళ్ల ఏర్పాట్లకు సంబంధించి సరైన చర్యలు చేపట్టలేదని ఎమ్మెల్యే అన్నారు. తిరునాళ్లపై ఇప్పటి వరకు రెండుసార్లు సమీక్షలు జరిగినా చర్యల్లేవన్నారు. తిరునాళ్ల సందర్భంగా ట్రాఫిక్‌జామ్ కాకుండా జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. సాగర్ కుడికాలవ నుంచి నీరు విడుదల చేస్తేనే భక్తులకు మంచినీటి సమస్య ఉండదన్నారు.
Advertisement
Advertisement