'రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది' | ysrcp leaders complaint to dgp on muppalla attack | Sakshi
Sakshi News home page

'రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది'

Jul 18 2014 6:16 PM | Updated on Aug 24 2018 2:36 PM

'రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది' - Sakshi

'రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది'

మేడికొండూరు ఘటనపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: మేడికొండూరు ఘటనపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్తలు తమపై దాడి చేసిన విధానాన్ని డీజీపీకి వివరించారు. ముప్పాళ్ల ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా టీడీపీ నేతల దౌర్జన్యాన్ని డీజీపీకి వివరించినట్టు వైఎస్‌ఆర్ సీపీ నేతలు తెలిపారు. ఇప్పటిదాకా స్థానిక పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు.

పోలీసులపై అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నట్టు అనుమానించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. ఈ నెల 13న మేడికొండూరు వద్ద వైఎస్ఆర్ సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు వెళ్తున్న ఎంపీటీసీలను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement