'బాధితులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించండి' | ysrcp demands rs 5lakhs exgrasia for boat victims | Sakshi
Sakshi News home page

'బాధితులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించండి'

Jun 6 2014 2:37 PM | Updated on Apr 3 2019 5:24 PM

నవాబుపేట, దవళేశ్వరం పడవ ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది.

తూ.గో: నవాబుపేట, దవళేశ్వరం పడవ ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది.  శుక్రవారం ఆ ప్రమాద బాధితుల కుటుంబాల్లో ఎనిమిది మందికి  రూ.లక్ష చొప్పున వైఎస్సార్ సీపీ పంపిణీ చేసింది.


 బుధవారం మృతుల కుటుంబాలను పరామర్శించిన జగన్ అండంగా ఉంటామని భరోసా ఇచ్చారు. పడవ ప్రమాద మృతుల కుటుంబ సభ్యులను ఆయన రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించారు. ఆయన జరిగిన సంఘటనను పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. సుమారు గంటకుపైగా ఆయన బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి బాధను పంచుకున్నారు. జరిగిన సంఘటన చాలా బాధాకరమని, అయితే మీ అందరికీ తోడుగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement