గరగపర్రు వివాద పరిష్కారానికి కమిటీ
పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో తలెత్తెతిన వివాదాన్ని పరిష్కరించేందుకు వైఎస్ జగన్ చొరవ చూపారు.
ఎమ్మెల్సీ ఆళ్ల నాని అధ్యక్షతన కమిటీ వేసిన వైఎస్ జగన్
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో తలెత్తెతిన వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చొరవ చూపారు. వివాద పరిష్కారానికి వైఎస్సార్ సీపీ తరపున కమిటీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఆళ్ల నాని అధ్యక్షతన కమిటీ నియమించారు. ఇందులో మేరుగ నాగార్జున, కొయ్యే మోషెన్‌రాజు, పాతపాటి సర్రాజు, కారుమూరి నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాదరాజు సభ్యులుగా ఉంటారు.
వైఎస్ జగన్ ఈరోజు గరగపర్రులో పర్యటించారు. వివాదం పూర్వాపరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తామని ఆయన హామీయిచ్చారు. ఇందులో భాగంగా తమ పార్టీ తరపున కమిటీ ఏర్పాటు చేసి మాట నిలుపుకున్నారు.


