గత అర్థారాత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉస్మానియా నుంచి నిమ్స్‌కు తరలించడంతో అభిమానులు, కార్యకర్తలను ఉత్కంఠకు గురిచేస్తోంది.
హైదరాబాద్ : గత అర్థారాత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉస్మానియా నుంచి నిమ్స్‌కు తరలించడంతో అభిమానులు, కార్యకర్తలను ఉత్కంఠకు గురిచేస్తోంది. జగన్ ఆరోగ్యం క్షీణించడంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిమ్స్ ఆస్పత్రి వద్దకు భారీగా తరలివస్తున్నారు. జగన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలపాలని కోరుతున్నారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరావాలని అంటున్నారు.
కాగా ఉస్మానియా నుంచి నిమ్స్‌కు జగన్ తరలిస్తున్న సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను, కార్యకర్తలను పోలీసులు విచక్షణారహితంగా తరిమేశారు. పోలీసుల నిర్బంధాన్ని కూడా పట్టించుకోకుండా చాలామంది జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.