జగన్ను చూసేందుకు నిమ్స్ చేరుకున్న విజయమ్మ | Vijayamma reaches NIMS hospital | Sakshi
Sakshi News home page

జగన్ను చూసేందుకు నిమ్స్ చేరుకున్న విజయమ్మ

Oct 11 2013 9:50 AM | Updated on Jan 7 2019 8:29 PM

జగన్ను చూసేందుకు నిమ్స్ చేరుకున్న విజయమ్మ - Sakshi

జగన్ను చూసేందుకు నిమ్స్ చేరుకున్న విజయమ్మ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసేందుకు వైఎస్ విజయమ్మ శుక్రవారం ఉదయం నిమ్స్కు చేరుకున్నారు.

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసేందుకు వైఎస్ విజయమ్మ శుక్రవారం ఉదయం నిమ్స్కు చేరుకున్నారు. ఆయనను విజయమ్మ పరామర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలంటూ  జగన్ మోహన్‌ రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షను బుధవారం అర్థరాత్రి భగ్నం చేసిన పోలీసులు ఆయనను నిమ్స్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అక్కడ వైద్యులు జగన్కు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై మీడియాతో మాట్లాడిన వైద్యులు వెను వెంటనే రెండు సార్లు నిరాహార దీక్ష చేపట్టడం జగన్ ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపిందని పేర్కొన్నారు.

 నెల రోజుల క్రితం జగన్ మోహన్‌ రెడ్డి  దీక్ష చేసినప్పుడే కీటోన్స్ ఎక్కువగా ఉన్నాయని, తిరిగి నెల రోజుల వ్యవధిలోనే మళ్లీ దీక్ష చేయడం, అదే స్థాయిలో కీటోన్స్ విడుదల కావడం శరీరంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ప్రస్తుతం కీటోన్స్ ఎక్కువగా ఉన్నాయని, అవి తగ్గడానికి సమయం పడుతుందన్నారు. వైద్య పరీక్షల తర్వాత షుగర్ లెవల్ 113కు పెరిగిందని, సాధారణస్థాయికి చేరుకునేందుకు మరికొంత సమయం పడుతుందని చెప్పారు.

 ప్రస్తుతానికి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నామని, పళ్లరసాలు తీసుకోవాలని జగన్‌కు సూచించామని చెప్పారు. శ్వాస తీసుకోవడం, పల్స్ రేటు, రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని వైద్యులు వెల్లడించారు. కాగా  జగన్ డిశ్చార్జిపై ఈరోజు ఉదయం నిర్ణయం ఉంటుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement