మరో ఆరు నెలల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమయని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబ శివరాజు అ న్నారు.
ఆరు నెలల్లో జగన్ పాలన
Dec 31 2013 1:51 AM | Updated on May 25 2018 9:12 PM
గుర్ల, న్యూస్‌లైన్ : మరో ఆరు నెలల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమయని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబ శివరాజు అ న్నారు. సోమవారం గోషాడ గ్రామానికి చెందిన పలువురు వైఎస్సార్ సీపీలో చే రారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి ప్రజల్లో ఎనలేని ఆదరణ ఉందన్నారు.పార్టీలో ఎవరు చేరాలన్నా.. ధైర్యంగా ముందుకు రావచ్చునని చెప్పా రు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది వైఎస్సార్ సీపీయేనని స్పష్టం చేశారు. అనంతరం ఆయన పార్టీలో చేరిన బోగురోతు అప్పలనాయుడు, రౌతు రమణ, మీసాల సంతోష్, రౌతు బంగారునాయుడు, పొందూరు వెంకట సత్యనారాయణ, రౌతు రమణ, మీసాల వెంకట సూరినాయుడుతదితరులకు కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. అంతకముందు గ్రామంలో పార్టీ జెండాను ఆవి ష్కరించి, గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్ర మంలో ఆ పార్టీ చీపురుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మీసాల వరహాలనాయడు, జిల్లా సభ్యుడు కృష్ణ, మండల కన్వీనర్ సూర్యనారాయణ, ప్రచార కమి టీ కన్వీనర్ వెంకటరమణ, పాల్గ్గొన్నారు.
Advertisement
Advertisement