
సాక్షి, ప్రకాశం: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 107వ రోజు ప్రకాశం జిల్లా వేటపాలెంలో ముగిసింది. నేటి ఉదయం సంతరావురు శివారు నుంచి వైఎస్ జగన్ ప్రారంభించిన పాదయాత్ర రాధాకృష్ణ నగర్, అంబేద్కర్ కాలనీ మీదుగా కొనసాగింది. దారి పొడవునా రాజన్న బిడ్డకు ప్రజలు ఘన స్వాగతం లభించింది. నేటి ప్రజాసంకల్పయాత్ర వేటపాలెంలో ముగిసింది. నేడు జననేత వైఎస్ జగన్ 4.8 కిలోమీటర్లు నడిచారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఓవరాల్‌గా వైఎస్ జగన్ 1,449.5 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.