చంద్రమౌళికి వైఎస్ జగన్‌ పరామర్శ

YS Jagan Visits Apollo Hospital and consoles chandramouli - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన చంద్రమౌళిని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. అనారోగ్యంతో హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చంద్రమౌళి చికిత్స పొందుతున్నారు. వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా ఆయనను పరామర్శించి...ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైఎస్‌ జగన్‌తో పాటు పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. విజసాయి రెడ్డి, మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, పుట్టపర్తి నియోజక వర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సమన్వయ కర్త శ్రీధర్‌ రెడ్డి కూడా చంద్రమౌళిని పరామర్శించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top