
సాక్షి, ప్రకాశం: వైఎస్‌ఆర్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. శనివారం ఉదయం వైఎస్ జగన్ హాజీస్‌పురం నుంచి ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కాంతంవారి పల్లి క్రాస్, చిన్న ఎర్లపాడు క్రాస్, పేరంగుంట కొత్తపల్లి క్రాస్ మీదుగా చింతళ పాలెం చేరుకుంటారు. అనంతరం అక్కడ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అక్కడ నుంచి మద్యాహ్నం 12 గంటలకు శంఖవరం చేరుకొని, భోజన విరామం తీసుకుంటారు.
మద్యాహ్నం 2. 45 గంటలకు తిరిగి పాదయాత్రను ప్రారంభిస్తారు. వైఎస్ జగన్ మూడు గంటలకు కనిగిరి పట్టణం చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత పాదయాత్ర టకారిపాలెం వరకు కొనసాగుతుంది. అక్కడ ఆయన ప్రజలతో మమేకం కానున్నారు. రాత్రికి వైఎస్ జగన్ ఇక్కడే బస చేస్తారు. రాజన్న బిడ్డకు దారిపొడవునా ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు.