
సాక్షి, విజయనగరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 270వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా ముగిసి విజయనగరానికి చేరింది. మంగళవారం జననేత పాదయాత్రను ఎస్. కోట నియోజకవర్గంలోని కొత్తవలస మండలం నుంచి ప్రారంభిస్తారు. అక్కడ నుంచి అడ్డుపాలెం, నిమ్మపాలెం, అప్పన్నపాలెం, గాంధీనగర్, గంగుపుడి జంక్షన్ మీదుగా మళ్లివీడుకు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్న విరామం తీసుకుంటారు. అనంతరం గొల్డ్‌స్టార్ జంక్షన్, జమ్మదేవి పేట, రంగపురం క్రాస్ మీదుగా రంగరాయపురం వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 269వ రోజు ముగిసింది. సోమవారం ఆయన ఉదయం పెందుర్తి నుంచి పాదయాద్ర ప్రారంభించారు. అక్కడి నుంచి సారిపల్లి, జంగాలపాలెం, చింతలపాలెం, తాడివానిపాలెం, దేశపాత్రుని పాలెం, కొత్త వలస మీదుగా తుమ్మికపాలెం వరకు పాదయాత్ర కొనసాగింది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న జననేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు.జననేత నేడు 11.1 కిలో మీటర్లు నడిచారు. ఇప్పటివరకూ వైఎస్ జగన్ 3,008 కిలోమీటర్లు నడిచారు.