నేడు గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన | Sakshi
Sakshi News home page

నేడు గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన

Published Thu, Feb 11 2016 8:32 AM

నేడు గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన - Sakshi

గన్నవరం విమానాశ్రయం నుంచి
రోడ్డు మార్గంలో ఉద్దండ్రాయునిపాలేనికి..

 
గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర  అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్  మోహన్‌రెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కుమార్తె వివాహానికి హాజరవుతున్నట్టు జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్ తెలిపారు. గుంటూరు స్తంభాలగరువులోని చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో జరగనున్న ఈ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారన్నారు. ఉదయం 9 గంటల సమయంలో  హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జగన్ తుళ్ళూరు మండలం ఉద్దండ్రాయునిపాలెం వెళతారు. పార్టీ నాయకుడు నందిగం సురేష్ మేనల్లుడు చలివేంద్ర నాగేంద్రబాబు వివాహ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. వడ్డమాను గ్రామంలోని పార్టీ నాయకుడు గొట్టం శివారెడ్డి కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి వివాహానికి హాజరవుతారు. ఆ తరువాత ప్రకాశం జిల్లా సంతమాగులూరులోని పార్టీ నాయకుడు ఆట్ల చిన వెంకట రెడ్డి కుమారుడు కోటిరెడ్డి వివాహం సందర్భంగా వధూవరులను ఆశీర్వదిస్తారు.

అక్కడి నుంచి 4.30 గంటల సమయంలో నాదెండ్ల మండలం చిరుమామిళ్ళ గ్రామం చేరుకుని మాజీ ఎమ్మెల్యే దొడ్డా బాల కోటిరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం మూడు గంటలకు బోయపాలెం వద్ద  జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికి, అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరనున్నట్లు మర్రి రాజశేఖర్ చెప్పారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం రాత్రికి అంబటి రాంబాబు కుమార్తె వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏఎస్‌ఆర్ సీడ్స్ అధినేత ఆళ్ల శ్రీనివాసరెడ్డి మేనల్లుడు కార్తీక్‌రెడ్డి వివాహానికి హాజరవుతారు.
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement