నా ఫొటో ప్రతి ఇంట్లో ఉండేలా మంచి చేస్తా | ys jagan mohan reddy speech in YSRCP Plenary | Sakshi
Sakshi News home page

నా ఫొటో ప్రతి ఇంట్లో ఉండేలా మంచి చేస్తా

Jul 9 2017 4:21 PM | Updated on Jul 25 2018 4:45 PM

నా ఫొటో ప్రతి ఇంట్లో ఉండేలా మంచి చేస్తా - Sakshi

నా ఫొటో ప్రతి ఇంట్లో ఉండేలా మంచి చేస్తా

చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో బతికివుండాలన్నదే తన కోరిక అని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు.

వైఎస్సార్‌ సీపీ ప్లీనరీలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

గుంటూరు: చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో బతికివుండాలన్నదే తన కోరిక అని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. చనిపోయిన తర్వాత నా ఫొటో ప్రతి ఇంట్లో ఉండేలా ప్రజలకు మంచి చేయాలన్న తపనను ఆయన వ్యక్తం చేశారు. చంద్రబాబు మాదిరిగా ఎన్నికల్లో అబద్దపు హామీలు ఇచ్చివుంటే తాము కూడా అధికారంలోకి వచ్చేవాళ్లమని చెప్పారు. భవిష్యత్తు తమదేనన్న భరోసా పార్టీ కార్యకర్తల్లో కనిపిస్తోందన్నారు. తాము అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తామని హామీయిచ్చారు. వైఎస్సార్‌ సీపీ ప్లీనరీలో జాతీయ అధ్యక్షుడి హోదాలో ముగింపు ఉపన్యాసం చేశారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే...

  • 2014 ఎన్నికల్లో చంద్రబాబు అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు.
  • గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థులు నా దగ్గరకు వచ్చారు
  • చంద్రబాబు ఇచ్చినట్టు అబద్దపు వాగ్దానాలు ఇచ్చేయని చెప్పారు
  • ఆరోజు నాక్కూడా జఠిలమైన సమస్యే
  • అలా చెప్పివుంటే బహూశా నేను ముఖ్యమంత్రిగా అయుండే వాడినేమో
  • మనం కూడా అధికారంలోకి వచ్చే వాళ్లమేమో
  • ముఖ్యమంత్రి కావాలనే కోరిక నాకు బలంగా ఉంది
  • ఒక్కసారి సీఎం అయిన 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలనేది నా కోరిక
  • చనిపోయిన తర్వాత నాన్న ఫొటో పక్కన నా ఫొటో కూడా ఉండాలి
  • ఎంతగా ప్రజలకు మంచి చేయాలంటే చనిపోయిన తర్వాత నా ఫొటో ప్రతి ఇంట్లో ఉండాలి
  • అబద్దపు హామీలు ఇచ్చివుంటే మీరంతా నన్ను గౌరవించేవారా?
  • అంతిమంగా గెలిచేది న్యాయం, ధర్మం. ఈ రెండు ఉన్నవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు
  • చంద్రబాబు అంత అవినీతిపరుడు దేశంలో ఎవరూ ఉండరు
  • అవినీతిలో ఏపీ దేశంలోనంబర్‌వన్‌లో స్థానంలో ఉంది
  • బాబు మూడేళ్ల పాలన మనకు కనిపించేది అవినీతి, అవినీతి, అవినీతి
  • కాగ్‌ రిపోర్టులు కూడా చంద్రబాబు చేస్తున్న అవినీతిని ధ్రువీకరించాయి
  • బాబు మూడేళ్ల పాలనలోఎవ్వరూ సంతోషంగా లేరు, ఏ ఒక్క సామాజిక వర్గానికి న్యాయం జరగలేదు
  • ఎక్కడ చూసిన అశాంతే, ఏ వర్గాన్ని చూసినా అన్యాయానికి గురయ్యామన్న భావనే
  • విద్యార్థులకు వెన్నుపోటు పొడిచిన దారుణమైన వ్యక్తి చంద్రబాబు
  • అన్యాయం చేయడానికి పూర్తిగా స్కేచ్‌ వేశారని కాపులు అంటారు
  • ఎవరి నోట చూసిన చంద్రబాబు అన్యాయం చేశారన్న మాటే వినబడుతోంది
  • అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయకపోగా, అగ్రిగోల్డ్‌ భూములను తక్కువ రేటుకు కొనుగోలు చేయించే ప్రయత్నం చేస్తున్నాడు
  • మేము అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తాం
  • అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసేందుకు, జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తాం
     

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement