ఒంటిమిట్ట మరో తిరుమల కావాలి: వైఎస్ జగన్ | ys jagan mohan reddy attened ontimitta rathostavam | Sakshi
Sakshi News home page

ఒంటిమిట్ట మరో తిరుమల కావాలి: వైఎస్ జగన్

Apr 3 2015 11:16 AM | Updated on Jul 25 2018 4:09 PM

ఒంటిమిట్ట మరో తిరుమల కావాలి: వైఎస్ జగన్ - Sakshi

ఒంటిమిట్ట మరో తిరుమల కావాలి: వైఎస్ జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి రథోత్సవంలో పాల్గొన్నారు.

ఒంటిమిట్ట:  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి రథోత్సవంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఆలయ పండితులు ఈ సందర్భంగా వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. పార్టీ నేతలతో కలిసి వైఎస్ జగన్‌.. స్వామివారి రథాన్ని లాగారు.

ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకోవటం ఆనందంగా ఉందని వైఎస్ జగన్ అన్నారు.  ప్రభుత్వం అధికారికంగా ఒంటిమిట్టలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించటం శుభపరిణామం అని అన్నారు. రాబోయే రోజుల్లో ఒంటిమిట్ట కూడా తిరుమల ఆలయం స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నట్లు వైఎస్ జగన్ తెలిపారు. కాగా వైఎస్ జగన్‌ రాకతో... జనం సందడి చేశారు. విజిల్స్‌ వేస్తూ... కేరింతలు కొడుతూ.. ఆనందోత్సాహాలతో రథోత్సవాన్ని జరుపుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement