
సాక్షి, ప్రకాశం: వైఎస్‌ఆర్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం తిమ్మపాలేం శివారు నుంచి వైఎస్ జగన్ 94వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం చెరువుకొమ్ము పాలెం, కె.అగ్రహారం మీదుగా జననేత పర్చూరివారిపాలెం చేరుకుని అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ఆయన భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 2.45 తిరిగి పాదయాత్ర మొదలవుతోంది.
కొండేపి నియోజక వర్గం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర కనిగిరి నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. అనంతరం వెంగళాపురం క్రాస్ మీదుగా పాదయాత్ర పెద్దఅలవలపాడుకు చేరుకుంటుంది. రాత్రి వైఎస్ జగన్ ఇక్కడే బస చేస్తారు. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ ఇప్పటి వరకు 1262.4 కిమీ నడిచారు. దారిపొడవునా మహానేతకు ప్రజలు నిరాజనాలు పలుకుతున్నారు.