కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి గ్రామ పరిధిలో బందరు రోడ్డుపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
Mar 5 2017 7:12 PM | Updated on Aug 30 2018 4:10 PM
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి గ్రామ పరిధిలో బందరు రోడ్డుపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెనమలూరు ఆశ్రమం కాలువ కట్టకు చెందిన తాపీ కార్మికుడు లింగాల సింహాచలం(26) మోపెడ్‌పై పోరంకి నుంచి పెనమలూరు సెంటర్‌కు బయలుదేరాడు. పచ్చళ్ల కంపెనీ వద్దకు రాగానే వెనుక నుంచి లారీ మోపెడ్‌ను ఓవర్‌టేక్ చేస్తున్న సమయంలో అదుపుతప్పి లారీ వెనుక చక్రాల కిందపడ్డాడు. లారీ అతని తలమీదగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement