ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పలువురు విద్యార్థులు బుధవారం వైఎస్‌ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిసి విజ్ఙప్తి చేశారు.
హైదరాబాద్ : రాజకీయ పార్టీలు తమ తమ మానిఫెస్టోలో బాలల హక్కులు కాపాడే విధంగా కృషి చేయాలంటూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పలువురు విద్యార్థులు బుధవారం వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిసి విజ్ఙప్తి చేశారు. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా లోటస్‌పాండ్‌లో 'సేవ్ ద చిల్డ్రన్ ఇంటర్నేషనల్ ఎన్జీవో' తరుపున వీరంతా విజయమ్మను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.
పేద బాలలు చదువుకునే హక్కుని కోల్పోతున్నారని...ఎన్నికల మానిఫెస్టోలో తమ హక్కులను కూడా ప్రస్తావించాలని వారు విజ్ఞప్తి చేశారు. విద్యార్ధుల సమస్యలపై విజయమ్మ సానుకూలంగా స్పందించారు. కచ్చితంగా విద్యార్థులకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. విజయమ్మను కలవడం తమకు సంతోషంగా ఉందని పలువురు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.