పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. దుండగులు ఓ యువతిని పట్టపగలే హైవేపై సజీవ దహనం చేశారు.
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఓ యువతిని పట్టపగలే హైవేపై సజీవ దహనం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లిగూడెం మండలం పెద్దతాడేపల్లి హైవేపై ఈ ఘోరం జరిగింది.
యువతి శరీర భాగాలు చాలా వరకు కాలిపోయాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఎవరు? హత్య చేసిన నిందితులు ఎవరు? ఈ దుశ్చర్య వెనుక గల కారణాలేంటి? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.