వెలి సంకెళ్లు

Village Families Suffering Expelled From 35Years In Chittoor - Sakshi

దురాచార బంధనం చేయని నేరానికి శిక్ష

కుమిలిపోతున్న కుటుంబాలు

36ఏళ్లుగా పట్టువీడని కులపెద్దలు

వేడుకున్నా.. కనికరం లేదు

స్పందించని పోలీసులు రాజగోపాలపురంలో వివక్ష

ఆ పాత దురాచార బంధాలు ఇంకా వీడలేదు. కట్టుబాట్ల సంకెళ్లుకు ఇంకా విముక్తి కలదు. చేయని పాపానికి 36 ఏళ్లుగా ‘వెలి’ శిక్ష నుంచి వారు బయటపడలేకున్నారు. ఆ నాటి దురాచా రాల చట్రంలో చిక్కుకున్న 10 కు టుంబాల కళ్లు ఇంకా శోకిస్తూనే ఉన్నాయి. ఊరంతా పండుగ చేసుకుంటుంటే ఆ కుటుంబాల్లో మాత్రం రోదనలు వినిపిస్తుంటాయి. మాతమ్మ ఆలయం వద్ద పూజలు జరుగుతుంటే, ఆ ఇళ్లలోని వారి గుండెలు క్షోభతో ఎగిసెగిసి పడుతుంటాయి. సమాజం నవనాగరికమైనా, సత్యేవేడు అరుందతివాడ వాసులు మాత్రం ఇంకా వివక్ష అనే శిక్షను అనుభవిస్తున్నారు.

చిత్తూరు : కాలం మారింది. పరిస్థితులూ మారాయి. ఆధునిక యుగంలో ఆ కుటుంబాల్లోని వారు విద్యావంతులయ్యారు. చైతన్యంచిగురించింది. ఈ కాలంలోనూ వెలి అనే దురాచారం ఏమిటి? అని నిలదీశారు.
అయినా, గ్రామ పెద్దలు స్పందించలేదు. పోలీసులను ఆశ్రయిస్తే, ఫలితం దక్కలేదు. సాంఘిక దురాచారాలపై గళమెత్తే సమాజ హితులు రంగంలోకి దిగితే కానీ, పరిస్థితి చక్కబడేలా కనిపించడం లేదు.
సత్యవేడు:సత్యవేడు మండలం రాజగోపాలపురం పంచాయతీ ఆరుందతివాడలో 130 కుటుంబాలు ఉన్నాయి. వారిలో 10 కుటుంబాలను 36 ఏళ్ల నుంచి వెలి అనే దురాచారంలో బందీలు చేశారు. గ్రామ దేవత పూజలకు కూడా వారిని అనుమతిం చడం లేదు. నాటి పెద్దల అనాగరిక ఆచారాలకు నేటి తరం బలవుతోంది.

ఇదీ కథ..
గ్రామంలో 36 ఏళ్లక్రితం ఆరిముల్ల, తలారి, ఈతముక్కుల కుటుంబాల వారు తప్పు చేశారని, అప్పటి పెద్దలు అనాగరిక ఆచారమైన వెలి శిక్ష వేశారు. ఆ కుటుంబాలను గ్రామంలోని  దేవతకు పూజలు చేయనివ్వకుండా వెలివేశారు.  ఆ మూడు కుటుంబాలు ప్రస్తుతం 10 కుటుంబాలకు పైగా పెరిగాయి. 36 సంవత్సరాల క్రితం గ్రామ పెద్దలు వెలి అనే శిక్షకు గురైన వృద్ధులు మృతి చెందారు. ఆ నీడలు ఇంకా వారి మనుమలు, మని మనవళ్లను కూడా వెంటాడుతూనే ఉన్నాయి. చ దువుతో పెరిగిన చైతన్యంతో ఆంక్షలపై నిలదీశా రు. అయినా స్పందన లేదు. ఇప్పటికీ ఆరిముళ్ల, తలారి, ఈత ముక్కుల కుటంబాల వారితో సంబంధాలు పెట్టుకోకూడదని, ఏ కార్యాలకు వెళ్లరాదని ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.

పూజలకు అనర్హం..
గ్రామంలో మాతమ్మ దేవాలయం ఉంది. తిరునాళ్ల సందర్భంగా గ్రామంలో ఇంటింటా చందాలు వసూలు చేస్తారు. అయితే, ఆ పది కుటుంబాల నుంచి మాత్రం ఎలాంటి చందా తీసుకోవడంలేదు. తాము పూజలు చేస్తామని, చందా తీసుకోవాలని వారు కోరుతున్నా కట్టుబాట్ల పేరిట తీసుకోవడం లేదు. పూజలు చేయకూడదని, పొంగళ్లు పెట్టకూడదని, నైవేద్యం సమర్పించరాదని పెద్దలు అడ్డుకుంటున్నా రు. ఈ కట్టుబాట్లు అతిక్రమిస్తే, ఆపరాధం చెల్లించా లని హెచ్చరిస్తున్నారని వివక్ష శిక్ష అనుభవిస్తున్న కుటుంబాలు కన్నీటిపర్యంతం అవుతున్నాయి

పోలీసులను ఆశ్రయించినా..
పూజలు చేయనివ్వకుండా.. అడ్డుకుంటున్నారని బాధితులు గత వారం స్థానిక పోలీసులను ఆశ్రయించారు. గ్రామపెద్దల చర్యల నుంచి తమకు విముక్తి కలిగించాలని వేడుకున్నారు. తమ గ్రామంలో వివక్ష ఉందని, ఈ కట్టుబాట్ల నుంచి విముక్తి కల్పించాలని వేడుకున్నారు.  సర్దుకుపోం డని పోలీసులు సమాధానం ఇవ్వడం మినహా, న్యాయం చేయలేదని వాపోతున్నారు.

కట్టుబాట్లు వీడని పెద్దలు
కాలం మారుతున్నా నేటికి  రాజగోపాలపురం అరుందతివాడలో కులపెద్దలు ఆచారం , కట్టుబాట్ల పేరుతో స్థానికులను వివక్షతకు గురిచేస్తున్నారు. గ్రామంలో పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న వారు, ఉద్యోగులు ఉన్నారు. స్వేచ్ఛ, హక్కుల కోసం ర్యాలీలు, పోరాటాలు చేసిన వారు గ్రామంలో ఉన్నారు. వివక్ష వీడాలని యువత కోరినా పెద్దలు పట్టువీడడం లేదు.  పుట్టి పెరిగిన ఊరిని వదలలేక, రోజూ మానసికక్షోభ అనుభవిస్తున్నట్లు  చెబుతున్నారు.

36 ఏళ్లుగా కన్నీళ్లే...
‘‘అందరూ గుడికి వెళ్లి పూజలు చేస్తున్నారు. మనమేం తప్పు చేశామని పూజలు చేయనియ్య రు’’ అని పిల్లలు అడిగినప్పుడల్లా ఏడుపు వస్తోంది. నాకు వివాహం జరిగి  36 ఏళ్లయ్యిం ది. కొత్త కోడలిగా అడుగు పెట్టినప్పటి నుంచి ఊర్లో ఉన్న గుడిలో మాతమ్మకు పూజ చేసే భాగ్యం లేదు. గ్రామంలో మాతమ్మ తిరునాళ్ల చేసినా, వినాయకచవితి జరిగినా గుడి వద్ద పొం గళ్లు పెట్టిందిలేదు. గ్రామదేవత ఊరేగింపు మా వీధిలోకి రాదు, వచ్చినా మాచేత అమ్మవారికి హారతులు పట్టించరు. ఊర్లో సంబరాలు జరుగుతుంటే, మా ఇంట్లో కన్నీళ్లు వస్తుంటాయి.–గుర్రమ్మ, అరుందతివాడ, రాజగోపాలపురం

వేదన భరిస్తున్నాం..
ఊర్లో అమ్మవారిని  కొలిచేందుకు పెద్దలు అ నుమతించరు. కట్టుబాట్ల పేరిట గుడి ఛాయలకే రానివ్వరు. వెళితే.. ఆపరాధం వేస్తామని  హెచ్చరిస్తారు. గ్రామంలో పండుగ జరిగితే అందరూ బంధువులను పిలుచుకుంటారు. మాకు ఆ భాగ్యం లేదు. పంచాయతీ పెద్దల కు చెప్పుకున్నాం. అరుందతివాడలో వారందరూ ఒకే కులస్తులు. వివక్షత ఎందుకంటు న్నా, పెద్దలు వినిపించుకోవడం లేదు. గత్యం తరం లేక తోటికులం వారితోనే అవమానాలు భరిస్తూ, జీవనం సాగిస్తున్నాం.–జమునమ్మ, అరుందతివాడ

సమాచారం తెలిసింది..
రాజగోపాలపురంలోని అరుందతివాడలో వి వక్షత విషయం కొద్ది రోజుల క్రితమే తెలిసిం ది. పోలీసులతో కలిసి గ్రామంలో వివక్షతను రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటాం. వి వక్షతపై గ్రామంలో సభలు, కౌన్సెలింగ్‌   ద్వా రా అవగాహన  కలిగించేందుకు చర్యలు తీసుకుంటాం. దేవాలయంలో పూజలు అడ్డుకోవ డం నేరం.– శ్రీనివాసులు, తహసీల్దార్‌ సత్యవేడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top