మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ప్రహరీ కూలి ఇద్దరు మహిళలు మృతిచెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కందుకూరు అర్బన్, న్యూస్‌లైన్ : మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ప్రహరీ కూలి ఇద్దరు మహిళలు మృతి చె ందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో కూలీలు ఇస్తర్ల కొండమ్మ, కలవకూరి ధనమ్మ ఉన్నారు. ప్రమాదం పట్టణంలోని సంతోష్‌నగర్ ప్రతిభ కళాశాల వద్ద సోమవారం జరిగింది. వివరాలు..
పట్టణంలోని సంతోష్‌నగర్ విక్కిరాలపేట రోడ్డు నుంచి ప్రతిభ కళాశాల మీదుగా ఓవీ రోడ్డుకు సుమారు రూ. 24 లక్షలతో కాలువ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఓ కాంట్రా రెండు రోజుల నుంచి కొండముడుసుపాలేనికి చెందిన 10 మంది కూలీలతో పనులు చేయిస్తున్నాడు. వీరితో పాటు ఉప్పుచెరువుకు చెందిన ఎం.వెంటేశ్వర్లు కూడా ఉన్నాడు.
సోమవారం కూలీలు వచ్చే సరికి కాంట్రాక్టర్ ప్రహరీ కింద నాలుగు అడుగులు లోతుమేర మట్టి తీయించాడు. ఇది గమనించని కూలీలు కాలువలోకి దిగి ఇసుక చదును చేస్తుండగా ఒక్కసారిగా ప్రహరీ కూలింది. దాని కింద కూలీలు చిక్కుకున్నారు. దగ్గరలోనే ఉన్న జేసీబీ డ్రైవర్ సంఘటన స్థలానికి మిషన్‌తో చేరుకుని గోడను పైకిలేపే ప్రయత్నం చేశాడు. కింద ఉన్నవారికి ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని అతను వెనకాడాడు. అప్పటకే ప్రతిభ కళాశాల విద్యార్థులు గొడకింద చిక్కుకున్న కూలీలను బయటకు తీసి ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే ఇస్తర్ల కొండమ్మ (50) మృతి చెందింది. ఒంగోలు తరలించిన కలవకూరి ధనమ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. కలవకూరి సుబ్బమ్మ కందుకూరులో చికిత్స పొందుతుండగా కలవకూరి మాధవి, తుమ్మ సింగమ్మ, కలవకూరి రమణమ్మలతో పాటు ఎం.వెంకటేశ్వర్లు ఒంగోలులో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ప్రజాసంఘాల నేతలు కోరుతున్నారు.